అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | లింగంపేట మండలం (Lingampet) మాలోత్ సంగ్య నాయక్ తండాలో (Sangya Naik Thanda) మేకల మందపై అడవి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఆరు మేకలు మృత్యువాత పడ్డాయి. వివరాల్లోకి వెళ్తే.. తండాకు చెందిన నేనావత్ సింధ్య ఇంటి సమీపంలో గురువారం కొట్టంలో మేకలను ఉంచారు. రాత్రి సమయంలో అడవి కుక్కలు (Wild dogs) దాడిచేసి ఆరు మేకలను హతమార్చాయి. ఉదయం లేచి చూసేసరికి మేకలు మరణించడంతో చిరుతదాడి చేసిందని గ్రామస్థులు ఆందోళన చెందారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్ఆర్వో ఓంకార్, సిబ్బంది గ్రామానికి వచ్చి పరిశీలించారు. అది చిరుత దాడి కాదని.. అడవి కుక్కలు మేకలను హతమార్చాయని తెలిపారు.
