అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bigg Boss Season 9 | బిగ్ బాస్ సీజన్ 9 లో మరోసారి వైల్డ్ కార్డు ఎంట్రీలతో హౌస్ హీటెక్కేలా కనిపిస్తోంది. ఇప్పటికే అగ్నిపరీక్ష నుంచి కామనర్స్‌గా కొందరు హౌస్‌లోకి (Big Boss House) వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చి సందడి చేస్తున్నారు.
ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంచ్ పేరుతో వైల్డ్ కార్డుల ఎంట్రీతో షో అదిరిపోనుందనే టాక్ వినిపిస్తుంది.. ఈ కొత్త ఎంట్రీలతో షోలో కొత్త మలుపులు తిరుగనున్నాయి. ప్రస్తుతం హౌస్‌లో 12 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వారిలో ఇద్దరు ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో బయటకు వెళ్లనుండగా.. అదే ఎపిసోడ్‌లో కొత్త వైల్డ్ కార్డు (Wild Card) ఎంట్రీలు కూడా జరగనున్నాయి.
Bigg Boss Season 9 | కొత్త వైల్డ్ కార్డు లిస్ట్‌లో ఎవరు ఉన్నారు?
తాజా సమాచారం ప్రకారం.. రెండవ రౌండ్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్లుగా ఆయేషా, నిఖిల్ నాయర్, గౌరవ్, శ్రీనివాస సాయి, దివ్వెల మాధురి, రమ్య పికిల్స్ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.
ఆయేషా : బిగ్ బాస్ తమిళ్ సీజన్ 6లో 60 రోజులు ఉన్ననటి. కమల్ హాసన్‌పై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’తో పాటు పలు తెలుగు సీరియల్స్‌లో నటించిన ఆమెకు సోషల్ మీడియాలో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
శ్రీనివాస సాయి : ‘గోల్కొండ హైస్కూల్’లో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి, ‘శుభలేఖలు’, ‘వినరా సోదర వీర కుమార’ సినిమాల్లో హీరోగా నటించాడు.
గౌరవ్ గుప్తా : ‘గీతా ఎల్ఎల్బీ’, ‘గృహలక్ష్మి’, ‘పలుకే బంగారమాయెనే’ వంటి సీరియల్స్‌లో నటించిన గౌరవ్ యూత్ ఐకాన్ 2022 అవార్డును కూడా గెలుచుకున్నాడు.
నిఖిల్ నాయర్ : మలయాళీ అయినప్పటికీ తెలుగు మంచిగా మాట్లాడే నిఖిల్, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన సీరియల్ హీరోగా గుర్తింపు పొందాడు.
రమ్య పికిల్స్ & దివ్వెల మాధురి : యూట్యూబ్ మరియు టీవీ ద్వారా ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఈ ఇద్దరూ హౌస్‌లో ఎంటర్ అవ్వడానికి రెడీ అయ్యారు.
ఈ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ల గ్రాండ్ ఎంట్రీ ఎపిసోడ్ ఆదివారం ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. కొత్త ఎంట్రీలతో షోలో కొత్త జోష్, కొత్త రచ్చ మొదలయ్యే అవకాశం ఉంది.