అక్షర టుడే గాంధారి : Wild Boar Attack Death | గేదె కోసం అడవికి వెళ్లిన వ్యక్తి అడవి పంది దాడిలో మృతి చెందాడు. ఈ ఘటన గాంధారి మండలంలోని (Gandhari Mandal) హేమ్లానాయక్ తండాలో చోటు చేసుకుంది.
Wild Boar Attack Death | హేమ్లానాయక్ తండాలో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలం హేమ్లా నాయక్ తండాకు (Hemla Nayak Thanda) చెందిన గుగులోతు సుభాష్(40) అనే వ్యక్తి బుధవారం సాయంత్రం తన గేదె తప్పిపోవడంతో గౌరారం శివారులో గల అడవుల్లో వెతకడానికి కొంతమందితో కలిసి వెళ్లాడు. అక్కడ అడవి పంది దాడి చేయగా సుభాష్ మెడపైన తీవ్ర రక్త గాయమై తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆయన మృతి చెందాడు. భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్సై ఆంజనేయులు (SI Anjaneyulu) దర్యాప్తు చేపట్టారు.
పలు కోణాల్లో విచారణ..
అయితే గుగులోత్ సుభాష్ మృతిపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. సుభాష్ మృతిచెందిన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి (Banswada Government Hospital) తరలించినట్లు ఎస్సై వెల్లడించారు. ఇందులో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ (CI Santosh Kumar), స్థానిక ఎస్సై ఆంజనేయులు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హేమచందన పోలీస్ ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.