అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amberpet Kidnap | అంబర్‌పేటలో ఇటీవల కిడ్నాప్‌కు గురైన రియల్టర్ మంత్రి శ్యామ్ కేసును పోలీసులు ఛేదించారు. శ్యామ్‌ను ఆయన మొదటి భార్య కిడ్నాప్ చేయించినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేశారు.
అంబర్‌పేట్‌కు చెందిన మంత్రి శ్యామ్ (Minister Shyam) కిడ్నాప్ గత నెల 29న కిడ్నాప్ అయ్యారు. ఆయనను కిడ్నాప్ చేసి నిందితులు రూ.1.5 కోట్లు డిమాండ్ చేశారు. బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీలోని కృష్ణతేజ్ రెసిడెన్సీలో నుంచి ఆయనను కిడ్నాప్ చేశారు. ఈ మేరకు శ్యామ్ రెండో భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు (police registered case) చేశారు. శనివారం శ్యామ్ ఎల్బీనగర్లో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడి వెళ్లి తీసుకొచ్చారు. అనంతరం కిడ్నాపర్ల కోసం గాలించగా సంచలన విషయాలు వెలుగు చూశాయి.
Amberpet Kidnap | ఆస్తి కోసం..
అమెరికాలో (America) శ్యామ్‌ను మాధవి లత వివాహం చేసుకుంది. వారి మధ్య విభేదాలు రావడంతో శ్యామ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. తన పేరును అలీగా మార్చుకుని ఫాతిమా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆస్తి తగాదాలతో పాటు ఇతర కారణాలతో భర్త శ్యామ్‌ను మాధవి లత కిడ్నాప్ చేయించింది. ఈ మేరకు మంగళవారం ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి (DCP Balaswamy) కేసు వివరాలు వెల్లడించారు. శ్యామ్ రెండు నెలల క్రితం తన ఆస్తులను అమ్మేశాడన్నారు. ఈ క్రమంలో ఆస్తి పంపకాల విషయంలో తేడా రావడంతో పాటు తనను, పిల్లలను సరిగ్గా చూసుకోవడం లేదని మాధవిలత కిడ్నాప్‌కు పథకం రచించింది.
Amberpet Kidnap | పక్కాగా..
మాధవి లత తనకు పరిచయం ఉన్న దుర్గ వినయ్‌తో కలిసి కిడ్నాప్‌కు ప్లాన్ చేసింది. దుర్గ వినయ్‌తో పాటు సాయి మరో ఇద్దరు యువతులు, మరికొంత మంది కలిసి శ్యామ్‌ను కిడ్నాప్ చేశారు. నిందితులు శ్యామ్ ఉంటున్న అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకి తీసుకొని అతడి కదలికలు గమనించారు. అనంతరం పక్కాగా ఆయనను కిడ్నాప్ చేశారు. ఈ కేసులో పది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. మరో నలుగురు పరారీలో ఉన్నారన్నారు.
