అక్షరటుడే, వెబ్‌డెస్క్: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక మహిళ తన భర్తను చంపేస్తానని భయభ్రాంతులకు గురిచేసింది. ఆమె తన ప్రేమికుడితో కలిసి భర్తను బెదిరించింది. తన భర్తను చంపి, నీలిరంగు డ్రమ్‌లో పాతిపెడతానని హెచ్చరించింది. దీంతో భయపడిపోయిన భర్త.. తన భార్యకు, ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆలయంలో ఈ వివాహ తంతు జరిగింది. తనను చంపేస్తానని చాలాసార్లు తన పెళ్లాం బెదిరించిందని బాధితుడు వాపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది.
చౌరిచౌరా పోలీస్ స్టేషన్ (Chauri Chaura police station) పరిధిలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. స్థానిక వ్యక్తి పదిహేనేళ్ల క్రితం కుషీ నగర్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు నలుగురు సంతానం. బాధిత భర్త పని నిమిత్తం కొన్నాళ్లు వేరే రాష్ట్రానికి వెళ్లాడు.
అతడి భార్య తన పిల్లలతో కలిసి గ్రామంలోనే ఉండిపోయింది. ఆ టైంలో సమీప గ్రామంలోని ఓ యువకుడితో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఏర్పడిన ఆకర్షణ వివాహేతర సంబంధానికి దారి తీసింది.
Uttar Pradesh : భర్తకు తెలియడంతో..
విషయం తెలిసిన భర్త.. ఆమెను మందలించాడు. కానీ, ఆమె వెనక్కి తగ్గలేదు. ప్రియుడితో మరింత ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది. ఒకరోజు పిల్లలను ఇంట్లోనే వదిలేసి, ప్రియుడితో లేచిపోయింది. దీంతో బాధిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Uttar Pradesh : స్ట్రాంగ్ వార్నింగ్..
దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సదరు లస్ట్ జంటను వెనక్కి పిలిపించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధిత భర్తకు అతడి భార్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తనకు భర్త అంటే ఇష్టం లేదని స్పష్టం చేసింది. ఒక వేళ బలవంతంగా ఇంటికి తీసుకెళ్తే.. తన భర్తను చంపేసి, మృతదేహాన్ని డ్రమ్‌లో వేసి సిమెంట్‌తో నింపేస్తానని బెదిరించింది. ఆ తర్వాత మళ్లీ తన ప్రియుడితో పారిపోతానని చెప్పింది.
Uttar Pradesh : వణికిపోయిన భర్త..
భార్య ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్‌కు భర్త షాక్ అయిపోయాడు. నిలువెళ్లా వణికిపోయి, ఓ నిర్ణయానికి వచ్చాడు. తన భార్యకు ఓ ఆలయంలో ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించి, ఇద్దరిని పంపించాడు. వారి బాగోతం తెలిసినప్పటి నుంచి తనను ఆమె చంపేస్తానని బెదిరిస్తూ వచ్చిందని బాధితుడు వాపోతూ చెప్పుకొచ్చాడు.