
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | రోజు రోజుకు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. ప్రజలు నేరాలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. చిన్న కారణాలతో కట్టుకున్న వాళ్లను చంపేస్తున్నారు. తాత్కాలిక ఆనందాల కోసం కడుపున పుట్టిన బిడ్డల ప్రాణాలు సైతం తీస్తున్నారు. ఇలాంటి ఇటీవల పెరుగుతుండడం సమాజంలో నేర ప్రవృత్తికి అద్దం పడుతోంది. తాజాగా ఓ మహిళ భర్తను చంపడానికి స్కెచ్ వేయగా.. ఆయన ప్రాణాలతో బయట పడ్డాడు. హైదరాబాద్‌లోని (Hyderabad) దుండిగల్ పోలీస్ స్టేషన్(Dundigal Police Station) పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నగరంలోని బాచుపల్లి పరిధిలో గల రాజీవ్ గృహకల్పలో (Rajiv Gruhakalpa) రాందాస్ నాయక్, జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2009లో పెళ్లి అయింది. వీరి మధ్య గొడవలు జరగడంతో మూడేళ్లుగా దూరంగా ఉంటున్నారు. అయితే ఇరు కుటుంబాల సభ్యులు మాట్లాడుకొని వారి నెల క్రితం వారిని కలిపారు. వారం రోజులుగా మళ్లీ దంపతుల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. దీంతో తన భర్తను చంపాలని జ్యోతి ప్లాన్ వేసింది.
Hyderabad | మద్యం తాగించి..
భర్త రాందాస్‌ను చంపడానికి జ్యోతి నలుగురు యువకులతో కలిసి ప్లాన్ చేసింది. దీంతో ఆ యువకులు శనివారం రాత్రి రాందాస్ తీసుకొని వెళ్లారు. అనంతరం బౌరంపేటలో (Bowrampet) రాందాస్ మద్యం తాగించి బీరు సీసాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన స్పృహ తప్పి పడిపోగా.. చనిపోయాడు అనుకొని అక్కడి నుంచి వెళ్లి పోయారు.
Hyderabad | ఇలా బయట పడింది..
తీవ్రంగా గాయపడిన రాందాస్ కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చాడు. అనంతరం తన తమ్ముడి ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. దీంతో వెంటనే రాందాస్‌ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. అనంతరం ఇద్దరు కలిసి బాచుపల్లి పోలీస్ స్టేషన్లో (Bachupalli Police Station) ఫిర్యాదు చేశారు. అయితే ఘటన జరిగిన ప్రాంతం దుండిగల్ ఠాణా పరిధిలోకి వస్తుందని పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును అక్కడకు బదిలీ చేశారు. ఈ మేరకు దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.