అక్షరటుడే, వెబ్డెస్క్: Krishna River | మేఘాలయ రాజా రఘువంశీ (Raja Raghuvanshi), గద్వాల తేజేశ్వర్ (Tejeshwar) హత్యలు మరువక ముందే.. మరో యువతి తన భర్తను చంపాలని ప్లాన్ వేసింది. సెల్ఫీ దిగుదామని చెప్పి తీసుకు వెళ్లి భర్తను నదిలో తోసిసేంది. అంతేగాకుండా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి భర్త ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని చెప్పింది. అయితే స్థానికులు ఆ యువకుడిని కాపాడడంతో అసలు విషయం వెలుగు చూసింది. లేదంటే ప్రమాదవశాత్తు నది పడి చనిపోయారని అందరూ అనుకునేవారు.
కర్ణాటకలోని రాయచూరు జిల్లా (Raichur District) శక్తినగర్‌కు చెందిన తాతప్ప, తన భార్యతో కలిసి బైక్పై వెళ్తున్నాడు. తెలంగాణలోని నారాయణపేట జిల్లా (Narayanpet District) కృష్ణా మండలంలో కృష్ణానది (Krishna River) వంతెన మీదుగా వారు ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం వరద పోటెత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో వంతెన వద్ద సెల్ఫీ దిగుదామని భార్య తాతప్పకు చెప్పింది. దీంతో ఆయన బైక్ ఆపి సెల్ఫీ(Selfie) దిగడానికి వెళ్లారు. ఈ క్రమంలో వంతెన అంచుకు వెళ్లిన తర్వాత భార్య తాతప్పను నదిలోకి తోసేసింది.
Krishna River | ఏమీ తెలియనట్లు..
భర్త నదిలో పడిపోగానే ఆ యువతి కుబుంబ సభ్యులకు ఫోన్ చేసింది. తాతప్ప ప్రమాదవశాత్తు నదిలో పడ్డాడని చెప్పింది. అయితే నదిలో పడ్డ తాతప్ప కొట్టుకుపోయాడు. ఈ క్రమంలో ఆయనను ఓ రాయి కాపాడింది. నది మధ్యలో ఉన్న రాయిని పట్టుకున్న తాతప్ప దానిపై కూర్చొని కాపాడాలని కేకలు వేశాడు. దీంతో స్థానికులు తాడు సాయంతో ఆయనను కాపాడారు.
Krishna River | సర్ది చెప్పిన స్థానికులు
స్థానికులు కాపాడటంతో తాతప్ప క్షేమంగా నదిలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు రాగానే భార్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను ఆమె తోసేసిందని మండిపడ్డాడు. ఆమెపై దాడి చేయడానికి యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో స్థానికులు దంపతులిద్దరికీ సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.