Makloor Mandal | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య.. హార్ట్​ ఎటాక్​ పేరుతో నాటకం

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Makloor Mandal | వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య తన భర్తను హత్య చేసింది. గుండెపోటుతో (heart attack) మృతి చెందాడని అందరినీ నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఈ ఘటన మాక్లూర్​ మండలంలోని బోర్గాం(కె)లో (Borgam(K) village) చోటు చేసుకుంది. మృతుడికి తమ్ముడు ఇజ్రాయిల్​ నుంచి తన అన్న మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భార్య బండారం బయటపడింది. మాక్లూర్​ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. […]

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Makloor Mandal | వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య తన భర్తను హత్య చేసింది. గుండెపోటుతో (heart attack) మృతి చెందాడని అందరినీ నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసింది. ఈ ఘటన మాక్లూర్​ మండలంలోని బోర్గాం(కె)లో (Borgam(K) village) చోటు చేసుకుంది. మృతుడికి తమ్ముడు ఇజ్రాయిల్​ నుంచి తన అన్న మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భార్య బండారం బయటపడింది.

మాక్లూర్​ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బోర్గాం(కె) గ్రామానికి చెందిన పల్లాటి రమేష్​(35)కు కొన్నేళ్ల క్రితం సౌమ్యతో వివాహం జరిగింది. అయితే ఆమెకు నందిపేట్​ మండలం (Nandipet mandal) బాద్గుణకు చెందిన దిలీప్​తో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన భర్త రమేష్​ పలుమార్లు భార్యను హెచ్చరించారు. దీంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఆమె ప్రియుడితో పన్నాగం పన్నింది. ఈ మేరకు గతేడాది ఆగస్ట్​లో రమేష్​ ఆర్మూర్​ నుంచి నిజామాబాద్​ వస్తుండగా కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు యత్నంచారు. ఈ ఘటనలో రమేష్​ కారుతో ఢీకొట్టిన వారిపై ఫిర్యాదు చేయగా కేసు సైతం నమోదైంది. అయితే రమేష్​ ఈ ఘటనలో మృతి చెందకపోవడంతో మళ్లీ డిసెంబర్​లో అతడిని హత్య చేసేందుకు సౌమ్య ప్రణాళిక వేసింది.

Makloor Mandal | సుపారీ గ్యాంగ్​కు డబ్బులిచ్చి..

రమేష్​ను ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించిన సౌమ్య తన ప్రియుడు దిలీప్​తో మరోసారి ప్లాన్​ వేసింది. ఈ క్రమంలో తన గోల్డ్​ రింగ్​ను ప్రియుడికి ఇవ్వగా అతడు ఓ ఫైనాన్స్​లో కుదువ పెట్టి రూ.35వేలు తీసుకొచ్చాడు. అనంతరం దిలీప్​ తన తమ్ముడు అభిషేక్​ను సంప్రదించగా అతడు బంటు జితేందర్​, కెలేత్​ శ్రీరాం, రమావత్​ రాకేష్​, మోసిన్​లతో గ్యాంగ్​ తయారు చేశాడు. వీరికి మొదటి విడతగా డిసెంబర్​ 16వ తేదీన రూ.25వేలు అందించాడు. మిగితా రూ.15వేలు రమేష్​ హత్య చేశాక ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు.

Makloor Mandal | మత్తుమందు కలిపి..

డిసెంబర్​19వ తేదీ రాత్రి భార్య సౌమ్య తన భర్త భోజనంలో మత్తు మందు కలిపింది. దీంతో అతడు నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే ఆమె దిలీప్​కు ఫోన్​ చేయగా దిలీప్​ సుపారి గ్యాంగ్​ సభ్యుడికి ఫోన్​ చేశాడు. కానీ వారు ఆ సమయంలో స్పందించకపోవడంతో తానే హత్య చేసేందుకు దిలీప్​ సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో దిలీప్​ తన తమ్ముడు అభిషేక్​తో కలిసి సౌమ్య ఇంటికి వచ్చాడు. నిద్రలో ఉన్న రమేష్​ ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి వెళ్లిపోయారు. అనంతరం ఉదయం సౌమ్య తన భర్త రమేష్​ హార్ట్​ ఎటాక్​తో చనిపోయాడని రోదిస్తూ అందరినీ నమ్మించింది.

ఈ సందర్భంగా అదేరోజు సాయంత్ర అంత్యక్రియలు సైతం పూర్తిచేశారు. కాని ఈ విషయమై ఇజ్రాయిల్​లో ఉంటున్న రమేష్​ తమ్ముడికి అనుమానం రాగా తన భార్యతో పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయించాడు. దీంతో పోలీసులు విచారణ చేయగా మృతుడి భార్య సౌమ్య బండారం బయటపడింది. అనంతరం పోలీసులు హత్యలో పాల్గొన్న సౌమ్య, ఆమె ప్రియుడు దిలీప్​, తమ్ముడు అభిషేక్​లతోపాటు సుపారీ తీసుకున్న గ్యాంగ్​ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్​లో మోసిన్​ పరారీలో ఉన్నాడు.

ఏసీపీ రాజా వెంకట్​ రెడ్డి ఆధ్వర్యంలో నార్త్​ రూరల్​ సీఐ శ్రీనివాస్​, మాక్లూర్​ పీఎసీ ఎస్సై రాజశేఖర్​ కేసు ఛేదనలో పాల్గొన్నారు. నిందితులను పట్టుకున్న హెడ్​ కానిస్టేబుల్​ రాజేశ్వర్, పీసీలు చందు, బాలాలింగం, రాకేశ్, రామకృష్ణ, శ్రీనివాస్, శ్రీకర్ గౌడ్, లక్ష్మీప్రసన్న, రచిత, బాబునాయక్, శ్రీకాంత్ గౌడ్, దత్తాద్రి గౌడ్, వెంకటస్వామి, సురేంధర్, చరణ్​లను ఏసీపీ రాజా వెంకట్​రెడ్డి అభినందించారు.

Related articles

Hitler police station | పోలీస్​ ఠాణాగా హిట్లర్​ హోం.. రూ. 247 కోట్లతో రెనోవేషన్​!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hitler police station | ఆస్ట్రియా దేశ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన  జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్...

Kishtwar Encounter Operation | జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishtwar Encounter Operation | జమ్మూ కశ్మీర్​లో ఆదివారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు....

Kamareddy College Land Dispute | ముదురుతున్న కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt Degree College) ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది.

Vemula Prashanth Reddy Protest | రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా : మాజీ మంత్రి వేముల

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు.