ePaper
More
    HomeజాతీయంViral Video | ‘బాయ్​ ఫ్రెండ్​తో కలిసి భార్య వేధింపులు.. భరించలేక భర్త సూసైడ్’.. వీడియో...

    Viral Video | ‘బాయ్​ ఫ్రెండ్​తో కలిసి భార్య వేధింపులు.. భరించలేక భర్త సూసైడ్’.. వీడియో వైరల్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Viral Video | పెళ్లంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని చెబుతారు పెద్దలు.. ఈ మాట ఊరికే చెప్పలేదని ఇటీవలి ఘటనలు చూస్తే అర్థమవుతుంది. మేఘాలయలో నవవరుడి హత్య, ప్రియుడితో కలిసి అమాయకుడిని బలి తీసుకున్న భార్య, అత్త.. ఇలా ఎన్నో ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హరియాణాలో వెలుగు చూసిన ఓ అమాయకుడి విషాద గాథ యువకులను పెళ్లంటేనే భయపడేలా చేస్తోంది.

    అప్పటికే ఆమెకు పెళ్లయి ఒక కొడుకు ఉన్నాడు.. కానీ, ఈ విషయం దాచి మరో అమాయకుడిని వివాహం చేసుకుంది.. అంతటితో ఆగకుండా ఓ పోలీసు అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. తన ప్రియుడి ప్రమోషన్ కోసం తాళి కట్టిన భర్తను ఘోరంగా టార్చర్ పెట్టింది.. పొలం అమ్మి డబ్బులు ఇవ్వాలనీ, భూమిని విక్రయించేందుకు ఒప్పుకోకుంటే.. మామయ్య(భర్త తండ్రి)ను చంపేయాలని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి.. చివరికి ఆ భర్త బలవంతంగా తనువు చాలించేందుకు కారణం అయ్యింది ఆ నయవంచకి. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ ఘటన హరియాణా (Haryana)లో చోటుచేసుకుంది.

    హరియాణాలోని రోహ్తక్​లో గల దోభ్​ గ్రామంలో మగాన్ అలియాస్ అజయ్ అనే యువకుడు జూన్​ 18న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు సోషల్​ మీడియాలో అతడు సూసైడ్ వీడియో పోస్ట్​ చేశాడు. తన భార్య దివ్య, ఆమె ప్రియుడు పోలీస్ ఇన్​స్పెక్టర్ దీపక్ కలిసి తనను టార్చర్ పెడుతున్నారని, తట్టుకోలేక.. చనిపోతున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు.

    Viral Video | ఎవరీ దివ్య..

    అజయ్​కి దివ్య ఇన్​స్టాలో పరిచయమైంది. ఇద్దరూ రిజిస్టర్​ మ్యారేజ్​ చేసుకున్నారు. ఈ దంపతులకు కొడుకు పుట్టాక దివ్య అసలు రంగు బయటపడింది. స్థానిక పోలీసు అధికారి దీపక్​తో దివ్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ దీపక్ ఔరంగాబాద్​లోని సంభాజినగర్​లో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిసింది.

    ఇక భార్య విచ్చలవిడి ప్రవర్తనతో పెళ్లయిన ఏడాదిన్నర తర్వాత ఆమె గురించి అజయ్​ ఎంక్వైరీ చేస్తే.. దివ్యకు గతంలోనే పెళ్లి జరిగిందని, ఒక కొడుకు కూడా ఉన్నాడని.. మొదటి మొగుడికి విడాకులు ఇవ్వకుండానే తనను పెళ్లి చేసుకుందని తెలిసి షాక్​ అయ్యాడు.

    Viral Video | బరి తెగించి..

    ఇక ప్రస్తుతం దివ్య తన పోలీసు ప్రియుడి కోసం బహిరంగంగానే బరి తెగించింది. తన లవర్​తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన భర్తకు పంపించి రాక్షసానందం పొందింది. అంతటితో ఆగకుండా తన ప్రియుడి ప్రమోషన్​ కోసం రూ.5 లక్షలు కావాలని భర్తపై ఒత్తిడి తెచ్చింది. ఇందుకోసం పొలం అమ్మేయమంది. పొలం అమ్మేందుకు అజయ్ తండ్రి ఒప్పుకోకుంటే.. ఆ ముసలోడిని చంపేయమని టార్చర్​ పెడుతూ తీవ్రంగా మానసిక క్షోభకు గురిచేసింది.

    Viral Video | రూ. 3.5 లక్షలు తీసుకుని.. ఇంకా డబ్బులు కావాలని..

    అప్పటికీ దివ్య, దీపక్​ వేధింపులు తట్టుకోలేక.. గోధుమలు అమ్మి రూ. 1.5 లక్షలు, బ్రేస్​లెట్​ కుదువపెట్టి రూ. 2 లక్షలు సర్ది ఆ వంచకులకు ముట్టజెప్పాడు. కానీ, ఇంకా రూ. 1.5 లక్షలు ఇవ్వాలంటూ వేధింపులకు పాల్పడ్డారు. ఈ డబ్బులకు అజయ్​ తండ్రిని చంపేసి, పొలం విక్రయించమని దివ్య, దీపక్​ కలిసి అజయ్​పై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో వీరి విచ్చలవిడి వెకిలిచేష్టలతో కూడిన డ్యాన్స్ వీడియోను అజయ్​కు పంపించి రాక్షసానందం పొందారు.

    Viral Video | నాన్నను చంపుకోలేనంటూ..

    వీటిన్నింటిని చూసి తట్టుకోలేని అజయ్​ బలవంతంగా తనువు చాలించాడు. చనిపోయే ముందు తన సూసైడ్​ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అందులో తన భార్య, ఆమె ప్రియుడి వేధింపులను కళ్లకు కట్టినట్లు చెప్పి కన్నీటిపర్యంతమయ్యాడు. ‘నేను భూమిని అమ్మలేను.. మా నాన్నను చంపుకోలేను.. నా భార్య దివ్య, ఆమె ప్రియుడు పోలీసు అధికారి దీపక్ టార్చర్​ భరించలేకపోతున్నాను. అందుకే సూసైడ్​ చేసుకుంటున్నానని’ దు:ఖ స్వరంతో దీపక్ వెల్లడించాడు.

    Viral Video | నా తల్లిదండ్రులను కాపాడండి..

    తన తల్లిదండ్రులు అమాయకులు అని, వారిని కాపాడమంటూ అజయ్ స్థానిక పోలీసులు, ఎమ్మెల్యే, ఎంపీలకు ఎమోషనల్​ వీడియో పోస్ట్​ చేశాడు. వారిని రక్షించాల్సిన బాధ్యతను ఎంపీ, ఎమ్మెల్యే, పోలీసులు తీసుకోవాలని విన్నవించాడు. తన కొడుకును తన తల్లిదండ్రులకే అప్పగించాలని, వాడిలోనే తనను చూసుకుంటారని గద్గద స్వరంతో చెప్పుకొచ్చాడు.

    Viral Video | వారిని కఠినంగా శిక్షించండి..

    తన చావుకు కారణం భార్య దివ్య, ఆమె లవర్ దీపక్ అని అజయ్​ వీడియోలో స్పష్టంగా చెప్పాడు. తనను టార్చర్​ పెట్టిన దివ్యను ఆమె ప్రియుడిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విన్నవించాడు.

    Viral Video | పురుషులకు అన్యాయం జరిగినా స్పందించండి..

    తన భార్య దివ్య చెల్లెలు సవితా ఆర్య పానిపట్​లో ఒక మహిళా సంఘం నేత అని అజయ్ వీడియోలో తెలుపుతూ.. ఆమెకు కూడా ఓ విన్నపం చేశాడు. ఆడవాళ్లకు ఏ చిన్న సమస్య వచ్చినా కన్నీళ్లు పెట్టే సవితా ఆర్య గారూ.. మగవాళ్లకు అన్యాయం జరిగినా కనీసం ఒక కన్నీటి చుక్కనైనా రాల్చమని ఆమెకు సలహా ఇచ్చాడు. అన్యాయానికి ఆడ, మగ అనే తేడా ఉండదని గుర్తుచేశాడు.

    Viral Video | మూడు నెలలుగా ఇంటికి దూరం..

    మార్చి 20, 2025న పని ఉందంటూ దివ్య వెళ్లిందని.. ఆ తర్వాత ఎప్పుడూ తిరిగిరాలేదని అజయ్​ తల్లిదండ్రులు తెలిపారు. ఫోన్​లోనే తన కొడుకు అజయ్​తో మాట్లాడేదని పేర్కొన్నారు. దివ్య కోసం పోలీసులు వెతుకుతున్నట్లు చెప్పారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...