అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరంలోని నాచారంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ప్రియుడి (Boy friend) మోజులో భర్తను హత్య చేసింది.
ఒడిశాకు (Odisha) చెందిన నారాయణ్ బెహరా, బంధిత బెహరా దంపతులు కొంతకాలంగా నాచారం మల్లాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. నారాయణ్ బెహరా ప్లంబర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం బంధితకు విద్యాసాగర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భర్తకు (husband) తెలియడంతో ఆమెను మందలించాడు.
Hyderabad | అడ్డు వస్తున్నాడని..
తమ వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని నారాయణ్‌ను అంతం చేయాలని బంధిత, విద్యా సాగర్ పథకం రచించారు. ఈ మేరకు ప్రియుడు విద్యా సాగర్‌తో కలిసి బంధిత భర్తను రాడ్డుతో కొట్టి చంపింది. అనంతరం ఏమి తెలియనట్లు నటించింది. అయితే మృతుడి బంధువులు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెప్పడంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ప్రియుడితో కలిసి తానే భర్తను హత్య చేసినట్లు బంధిత ఒప్పుకుంది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.