అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tamil Nadu | సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. తాత్కాలిక ఆనందాలు, సుఖాల కోసం కొందరు హత్యలు చేయడానికి వెనకడాటం లేదు. ప్రేమ, వివాహేతర సంబంధాల మోజులో కట్టుకున్న వారిని కడతేరుస్తున్నారు. ఇటీవల ఇటువంటి ఘటనలు వెలుగు చూస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ మహిళ తన ప్రియుడితో (boyfriend) భర్తను చంపించింది.
తమిళనాడు రాష్ట్రం (Tamil Nadu state) వేలూరు జిల్లా కుప్పంపాళ్యానికి చెందిన భరత్(36)కు ఐదేళ్ల క్రితం బెంగళూరుకు (Bangalore) చెందిన నందిని(26)తో వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భరత్ చెన్నైలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. దీంతో వారంలో ఒక్క రోజు మాత్రమే ఇంటికి వస్తాడు. ఈ క్రమంలో నందిని ఇంటి ఎదురుగా ఉన్న సంజయ్(21) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
Tamil Nadu | పద్ధతి మార్చుకోవాలని చెప్పడంతో..
నందిని, సంజయ్ వ్యవహారం భరత్‌కు తెలిసింది. పద్ధతి మార్చుకోవాలని భార్యను పలుమార్లు మందలించాడు. దీంతో ఆయనపై నందిని పగ పెంచుకుంది. ఎలాగైనా చంపాలని ప్రియుడితో కలిసి ప్రణాళికలు రచించింది. ఈ క్రమంలో ఈ నెల 21న ఇంటికి వచ్చిన భరత్ సరుకుల కోసం భార్య, చిన్న కూతురును బైక్‌పై దుకాణానికి తీసుకెళ్లాడు. తాము బయటకు వెళ్తున్న విషయం నందిని అంతకుముందే ప్రియుడికి చెప్పింది. భర్తపై (husband) దాడి చేసి చంపాలని చెప్పింది.
Tamil Nadu | నిందితుల అరెస్ట్
తిరిగి వచ్చే మార్గంలో సంజయ్ రోడ్డుపై కొబ్బరిమట్టలు అడ్డు పెట్టాడు. వాటిని దాటుతుండగా బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది. అక్కడే దాక్కొని ఉన్న సంజయ్ వెంటనే వచ్చి భరత్‌ను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే విచారణ సమయంలో నందిని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో చిన్న కూతురిని ప్రశ్నించారు. దీంతో ఆ మూడేళ్ల బాలిక తమ ఇంటికి ఎదురుగా ఉండే సంజయ్ మామ తండ్రిని కొట్టి పారిపోయాడని చెప్పింది. దీంతో వారి వ్యవహారం బయట పడింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చిన పోలీసులు నందిని, సంజయ్‌ని అరెస్ట్ చేశారు.
Tamil Nadu | పెరుగుతున్న నేర ప్రవృత్తి
ప్రస్తుతం సమాజంలో నేర ప్రవృత్తి పెరిగి పోతోంది. చాలా వరకు హత్యలు, ఆత్మహత్యలకు వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు కారణం అవుతున్నాయి. కొందరు భార్యలను కడతేరుస్తుంటే.. మరికొందరు మహిళలు ప్రియుడితో కలిసి భర్తలను అంతం చేస్తున్నారు. ఇటీవల ప్రియుడి మోజులో భర్తలను హత్య చేయిస్తున్న మహిళలు పెరిగి పోయారు. ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండటంతో యువకులు పెళ్లంటనే భయ పడుతున్నారు. ఇష్టం లేకపోతే విడిపోయి హాయిగా బతకొచ్చు. కానీ ఇలా ప్రాణాలు తీస్తుండటంతో కుటుంబంలో విషాదాన్ని నింపడంతో తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు.