అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | నిత్యం తనను అనుమానిస్తూ వేధిస్తున్న భర్తను హత్య చేసిందో భార్య.. ఈ ఘటన ఎల్లారెడ్డి పట్టణంలో (Yellareddy town) మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రత్నావత్ తుకారాం (36)కు పదహారేళ్ల కిందట మీనా అనే మహిళతో వివాహమైంది.
వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే భార్యాభర్తల (husband and wife) మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అనేకసార్లు పంచాయతీలు కూడా అయ్యాయి. అయితే తరచూ తనను అనుమానంతో వేధిస్తుండడంతో 26వ తేదీన తెల్లవారుజామున మూడు గంటలకు భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి మీనా హత్య చేసింది. ఈ మేరకు నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు అమెను రిమాండ్కు తరలించారు. మృతుడి తమ్ముడు హర్జ్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.