Homeజిల్లాలుకామారెడ్డిBirkur | రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. భర్తకు తీవ్రగాయాలు

Birkur | రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. భర్తకు తీవ్రగాయాలు

బీర్కూర్ మండలం రైతునగర్​లో గ్రామ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భార్యభర్తలను రైతునగర్ వద్ద ఆటో ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

- Advertisement -

అక్షరటుడే, బీర్కూర్: Birkur | బీర్కూర్ మండలం రైతునగర్ (Raithunagar) గ్రామ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెమ్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై కిష్టాపూర్​కు (Kistapur) వెళ్తుండగా రైతునగర్ వద్ద ఆటో ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

భార్య శకుంతలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ప్రైవేట్ వాహనంలో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి (Banswada Area Hospital) తరలించారు. మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. భర్త సాయాగౌడ్​కు రెండు కాళ్లకు తీవ్రమైన గాయాలు కావడంతో ఆయనను నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Must Read
Related News