ePaper
More
    Homeఅంతర్జాతీయంViral Video | భర్త అంత్యక్రియల్లో భార్య సంబరం.. ట్వర్కింగ్​ చేస్తూ సందడి.. నెట్టింట వైరల్​

    Viral Video | భర్త అంత్యక్రియల్లో భార్య సంబరం.. ట్వర్కింగ్​ చేస్తూ సందడి.. నెట్టింట వైరల్​

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Viral Video | ఓ భర్త అంత్యక్రియల సందర్భంగా అతని భార్య చేసిన చర్య.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. పెరూ దేశంలో జరిగిన ఈ ఘటనలో, భర్తకు చివరి వీడ్కోలు చెప్పడానికి అతని భార్య, ఆయన పూర్తి పరిమాణంతో ఉన్న కార్డుబోర్డ్ కటౌట్‌పై ట్వర్కింగ్ చేసింది. ఆ కటౌట్ అతని మృతదేహం ఉన్న పాడెకు ఆనుకొని ఉంది.

    ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రఖ్యాత రేగ్గటోన్ గాయకుడు ‘ఎల్ కాంగ్రీ డెల్ కాల్లావో’ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తీవ్ర వైరల్​ అవుతోంది.

    Viral Video | అంత్యక్రియలకు హాజరైనవారు ఏమి చేశారంటే..

    ఆ వీడియోలో ఏముందంటే.. భర్త అంత్యక్రియల్లో భార్య ప్రదర్శన ఇస్తున్నట్లుగా ఉంది. డ్యాన్స్ చేస్తూ భర్త కటౌట్​ను తన వెనుకకు తాకించుకుంటూ సందడి చేస్తోంది. కాళ్లు తిప్పుతూ, కదులుతూ భర్తకు వీడ్కోలు చెబుతోంది. డ్యాన్స్ చేస్తూ అతడిని వీడుతున్నట్లుగా వీడియోలో ఉంది. అంత్యక్రియలకు వచ్చిన వారు ఆమె చేష్టలకు షాక్​ అయ్యారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు తమ సెల్​ఫోన్​లో చిత్రీకరిస్తూ సందడి చేశారు.

    Viral Video | భిన్నంగా స్పందన..

    కాగా ఈ వీడియోకు నెట్టింట ఇప్పటి వరకు 4.3 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. “మన కాలంలో అంత్యక్రియల్లో కుటుంబీకులు బంధువులు, ప్రజలు కన్నీరు కార్చేవారు” అంటూ ఒకరు కామెంట్​ పెట్టారు. “ఆమె నృత్యం బాగానే చేస్తోంది. కానీ, ఆమె భర్త కటౌట్ కఠినంగా ఉంది” అంటూ ఒక నెటిజన్​ చమత్కరించారు. “ఈ ఘోరం చూడలేకపోతున్నట్లు.. తనను త్వరగా పూడ్చేయండని ఆమె భర్త కోరుకుంటున్నట్టున్నాడు!” అంటూ ఇంకొకరు వ్యంగ్యంగా పోస్టు చేశాడు.

    Viral Video | భావోద్వేగానికి భిన్నంగా..

    భర్త అంత్యక్రియల్లో భార్య ట్వర్కింగ్​(ఒకలాంటి లైంగిక నృత్యం) ఘటన సంప్రదాయాలకు భిన్నంగా ఉందని కొందరు విమర్శిస్తున్నారు. కుటుంబంలో ఒక వ్యక్తి మరణంతో కలిగే భావోద్వేగాన్ని.. ఆమె వినోదాత్మకంగా మార్చిందని మండిపడుతున్నారు. ఇంకొందరు మాత్రం.. ఇది మృతుడికి సరైన ఆనందభరిత వీడ్కోలుగా ఉందని కామెంట్​ చేశారు.

     

    More like this

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 9,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...