అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bihar : మహిళలు సున్నిత మనస్కులు అనేది పాత నానుడి.. వారు అనుకున్నది చేయడానికి ఎంత కఠినంగానైనా మారతారనేది నేటి ఒరవడి.. పెళ్లికి ముందే ప్రియుడితో సంబంధం, పెళ్లి తర్వాత వివాహేతర సంబంధం.. ఇలాల కారణం ఏదైనా.. భర్తలను కడతేర్చుతున్నారు భార్యలు. ఇటీవల రోజుకో ఘటన వెలుగుచూస్తోంది.
ఇలాంటి వార్తలు వింటుంటే పెళ్లంటే భయపడిపోతున్నారు యువకులు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఆమెతో సంసారం చేయాలంటే కూడా ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న టెన్షన్ కొందరిలో ఉంటోంది. తాజాగా భార్య (Wife) చేతిలో మరో అభాగ్యుడు హింసకు గురయ్యాడు.
కానీ, ఈసారి చావు కంటే ఘోరమైన ఘటన ఇది. కోపంతో తన భర్త నాలుకను కొరికి మింగేసింది ఓ భార్య. బిహార్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
భార్యాభర్తల మధ్య తగవులు సర్వసాధారణం. అది ఏ వయసులో ఉన్న జంటకైనా ఎదురయ్యే అనుభవం. ఎంత గొడవలు ఉన్నా.. కోపం ఎక్కువై కొట్టుకుంటారు.. ఆ తర్వాత సర్దుకుపోతారు. కానీ, బిహార్లోని గయా (Gaya) ప్రాంతానికి చెందిన ఓ భార్య.. తన భర్తపై ఆగ్రహించి, అతడి నాలుకను కసుక్కున కొరికేసింది. తర్వాత ఆ నాలుక ముక్కను నమిలి మింగేసింది. ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Bihar : ఏమిటీ వీరి గొడవ..
గయాలోని ఖిజ్రాసరాయ్ Khijrasarai పోలీస్ స్టేషన్ police station పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇక్కడ ఉండే ఓ భార్యాభర్తల నడుమ చిన్న విషయంలో గొడవ మొదలై చిలికి చిలికి గాలివానలా మారింది. మాటామాటా పెరిగి ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. దీంతో భార్య కోపం నషాలానికి చేరింది. అలా ఆమెకు తిక్కరేగి భర్త నాలుకను కసకసా కొరికేసింది. తర్వాత దానిని పాన్ నమిలినట్లు నమిలి మింగేసింది.
తీవ్రంగా గాయపడిన ఆ భర్త దీన స్థితిని చూసిన స్థానికులు, అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మగధ్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స తర్వాత కూడా సదరు భార్యాభర్తలు గొడవ పడినట్లు స్థానికులు చెప్పుకొచ్చారు.
Bihar : ఫిర్యాదు చేయలే..
భార్యాభర్తల గొడవ రక్తసిక్తమైనా.. దానిపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. కాగా, క్షుద్రపూజలు చేయడంలో భాగంగా ఇలా జరిగినట్లు ఇంకొందరు చెప్పుకొచ్చారు.
Bihar : రాజస్థాన్లోనూ..
రాజస్థాన్ Rajasthan లోని జల్వార్ Jhalwar జిల్లాలోనూ కొంత కాలం క్రితం ఇలాంటి ఘటన వెలుగుచూసింది. తన భర్త నాలుకను కొరికి అతడిని తీవ్రంగా గాయపరిచింది భార్య. తర్వాత తన తప్పు తెలుసుకుని బాధపడి, ఆత్మహత్యకు యత్నించగా.. కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు.