Homeజిల్లాలుఖమ్మం Khammam | దెయ్యం ప‌ట్టిన‌ట్టు న‌టించి.. నోట్లో గుడ్డ‌లు కుక్కి భ‌ర్త‌ను చిత‌క్కొట్టిన భార్య‌

 Khammam | దెయ్యం ప‌ట్టిన‌ట్టు న‌టించి.. నోట్లో గుడ్డ‌లు కుక్కి భ‌ర్త‌ను చిత‌క్కొట్టిన భార్య‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khammam | ఇటీవల భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న‌ మనస్పర్ధలు తీవ్ర ఘర్షణలకు దారి తీస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిచోట్ల భార్యలు భర్తలపై దాడులు చేస్తే.. మరికొన్ని చోట్ల భర్తలు భార్యలపై దాడి చేస్తున్న దారుణ ఘటనలు వార్తల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తాజాగా ఖమ్మం (Khammam) జిల్లా పెనుబల్లి మండలం వీ.ఎం.బంజర్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక జంగాల కాలనీలో (Jangala Colony) నివసించే గంగారం, లక్ష్మి అనే దంపతులు గత 35 ఏళ్లుగా ఒక్కటిగా జీవిస్తున్నారు. కానీ గంగారాం మద్యానికి బానిసగా మారడంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఇటీవల ఈ గొడ‌వ‌లు మ‌రింత ముదిరి.. కోపంతో లక్ష్మి తన భర్త నోట్లో గుడ్డలు పెట్టి, ఇనుప రాడ్‌లు (Iron Rods), కర్రలతో తీవ్రంగా దాడి చేసింది.

 Khammam | ఇదో నాట‌కం..

తీవ్ర గాయాలతో గంగారాం కేకలు పెడుతూ ఇంటి నుంచి బయటకు పరుగులు తీశాడు. అతడిని చూసిన స్థానికులు ఆందోళన చెందగా.. లక్ష్మి మాత్రం దెయ్యం పట్టిందని నటించింది. “నాకు ఏం జరిగిందో కూడా తెలియదు” అంటూ అమాయకంగా మాట్లాడింది. కానీ భర్త మాత్రం ఇది ప్లాన్‌ చేసిన దాడి అని ఆరోపించాడు. ఇటువంటి పరిణామాల మధ్య గంగారాం నేరుగా పోలీస్ స్టేషన్‌కు (Police Station) వెళ్లి తన భార్యపై ఫిర్యాదు చేశాడు. ఆమె తనపై ఇనుప రాడ్‌లు, కర్రలతో దాడి చేసిందని, ప్రాణాలకు భయపడి బయటకు పరుగులు తీశానని వివరించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

భార్య దాడిలో గంగారాం పక్కటెముకలు విరిగాయి. అత‌ను తీవ్రంగా గాయపడడంతో వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి (Khammam Government Hospital) తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. “ఇలా కూడా రివెంజ్ తీసుకుంటారా?” అంటూ నెటిజన్లు  ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన మానవ సంబంధాలు ఎంత భయంకర స్థాయికి చేరిందో నిరూపిస్తుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు తారస్థాయికి వెళ్లకముందే పరిష్కరించుకోవడం ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.