అక్షరటుడే, వెబ్డెస్క్ : Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విస్తారంగా వర్షాలు heavy rains కురిశాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు Southwest monsoon ముందుగానే తెలంగాణను తాకుతాయని వాతావరణ శాఖ Meteorological Department అధికారులు ప్రకటించారు. అయితే రుతుపవనాలు రాకముందే బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధ్రోణి Low-pressure basin ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి.
Heavy Rains | తెల్లవారుజాము నుంచే..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచే వర్షాలు rainfall మొదలయ్యాయి. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో తెల్లవారుజామున భారీ వర్షం heavy rains కురిసింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా మోస్తరు వర్షం పడింది. హైదరాబాద్ hyderabad city లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, బషీర్‌బాగ్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, లక్డీకపూల్‌లో వర్షం పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షం పడింది.
Heavy Rains | చల్లబడిన వాతావరణం
ఈ ఏడాది మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచికొట్టాయి. జనాలు బయటకు వెళ్లాలంటే భయపడేలా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో మే లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడ్డారు. అయితే మే నెలలో ఉష్ణోగ్రతలు temperatures అంతగా నమోదు కాలేదు. మే ప్రారంభం నుంచి అడపాదడప వర్షాలు కురుస్తుండటంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం లభించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మబ్బులతో కూడిన వాతావరణం ఉంది. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.
Heavy Rains | రేపు భారీ వర్షాలకు అవకాశం
బంగాళాఖాతం Bay of Bengalలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఇది మరో 12గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. రాబోయే 36గంటల్లో వాయుగుండంగా మారుతుంది. దీంతో రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. బుధవారం కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ mahabubabad జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు మృతి చెందారు.
Heavy Rains | పొలం పనుల్లో రైతన్నలు
ఈ ఏడాది వర్షాలు ముందుగానే పడుతుండటంతో అన్నదాతలు farmers పొలం పనుల్లో బిజి అయిపోయారు. దుక్కులు దున్ని పెట్టుకున్నారు. తుకం పోయడానికి నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. పలువురు రైతులు సేంద్రియ ఎరువులు, చెరువు మట్టి పొలాల్లో వేసుకుంటున్నారు. ఈ ఏడాది సాధారణం కంటే అధికంగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో అన్నదాతలు ఎన్నో ఆశలతో వానాకాలం సీజన్ Rainy seasonకు సమయాత్తం అవుతున్నారు.
Heavy Rains | తడిసిన ధాన్యం
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ధాన్యం paddy తడిసి రైతులు farmers ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో కొనుగోళ్లు చివరి దశకు వచ్చాయి. అయితే పలు గ్రామాల్లో నత్తనడకన సాగుతున్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి పోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. వడ్లు తడిసి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనాలని రైతులు కోరుతున్నారు.
Heavy Rains | అప్రమత్తంగా ఉండాలి.. సీఎం
రాష్ట్రంలో వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి cm revanth reddy అధికారులతో సమీక్షించారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్‌లలో.. ధాన్యం తడవకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు.