అక్షరటుడే, వెబ్డెస్క్: Vastu Tips | సొంత ఇల్లు (Own House) అనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. ఎన్నో ఏళ్ల కష్టం, మరెన్నో ఆశల కలయికే ఒక అందమైన గృహం. అయితే, ఆ కల నిజమైనప్పుడు అది మనకు సుఖశాంతులను ఇవ్వాలి అంటే వాస్తు శాస్త్ర నియమాలను పాటించడం తప్పనిసరి. కేవలం డబ్బు, స్థలం ఉంటే సరిపోదు.. శాస్త్రం ప్రకారం సరైన ‘ముహూర్తం’లో పునాది రాయి వేయడం కూడా అంతే ముఖ్యం. కొత్త ఇల్లు కట్టాలనుకునే వారు కొన్ని నిర్దిష్ట మాసాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని నెలల్లో గృహ నిర్మాణం మొదలుపెట్టడం వల్ల ఆర్థిక సంక్షోభం, అనారోగ్యం, కుటుంబ కలహాలు ఎదురవుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Vastu Tips | ఏ మాసాల్లో నిర్మాణం చేపట్టకూడదు?
పుష్య మాసం: ఈ మాసంలో సూర్యుడు బలహీనంగా ఉంటాడు. పురాణాల ప్రకారం ఈ సమయాన్ని భూదేవి గర్భవతిగా ఉన్న కాలంగా పరిగణిస్తారు. కాబట్టి, ఈ సమయంలో పునాది కోసం భూమిని తవ్వడం వల్ల భూమాత ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఇంట్లో ఆనందం లోపించడం, పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తడం, వ్యాపారాల్లో వరుస నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది.
చైత్ర మాసం: కొత్త ఏడాదికి నాంది పలికే మాసమైనప్పటికీ, ఇంటి నిర్మాణానికి ఇది అనువైనది కాదు. ఈ మాసంలో పునాది వేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, అనవసర గొడవలు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
అశ్విని మాసం: ఈ నెలలో ఇల్లు కట్టడం ప్రారంభించడం వల్ల ఇంట్లోని స్త్రీల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, ఆ గృహంలో భద్రత లోపించడం, ధన నష్టం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని శాస్త్రం చెబుతోంది.
భాద్రపద మాసం: ఇది పితృదేవతలకు సంబంధించిన సమయం. ఈ మాసంలో పునాది తీయడం వల్ల పూర్వీకులు బాధపడతారని, వారి కోపానికి గురవ్వాల్సి వస్తుందని నమ్ముతారు. దీనివల్ల వృత్తి, వ్యాపారాల్లో అడ్డంకులు ఎదురవడమే కాకుండా కుటుంబ సభ్యులకు హాని కలిగే ప్రమాదం ఉంది.
కాబట్టి, మీరు ఎంతో ఇష్టపడి ఇల్లు నిర్మించుకునే ముందు అనుభవజ్ఞులైన వాస్తు పండితులను సంప్రదించి, సరైన ముహూర్తాన్ని ఎంచుకోవడం శ్రేయస్కరం. అప్పుడే ఆ ఇల్లు సిరిసంపదలతో, సుఖశాంతులతో విరజిల్లుతుంది.