అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rohit sharma retirement | హిట్ మ్యాన్ రోహిత్ శర్మ Rohit Sharma కొన్నాళ్లుగా ఫామ్ లేమితో బాధపడుతున్నాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ అలరిస్తున్నాడు. అయితే సడెన్‌గా గత రాత్రి రోహిత్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ (rohit sharma test cricket retirement) ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన సోషల్ మీడియా (social media) ద్వారా రోహిత్ శర్మ తన రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అయితే, తాను వన్డే క్రికెట్ (ODI cricket) ఆడటం కొనసాగిస్తానని, సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడనంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. సడెన్‌గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడా అని అందరు జుట్టు పీక్కుంటున్నారు.
Rohit sharma retirement | సడెన్ నిర్ణయం ఎందుకు..
టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ (rohit sharma test cricket retirement) అతని అభిమానులను ఎంతో నిరాశకి గురి చేసింది. వాస్తవానికి టెస్ట్ ఫార్మాట్‌లో ఇంకొన్నాళ్లు కొనసాగాలని రోహిత్ శర్మ అనుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) అనంతరం ఓ ఇంటర్వ్యూలో ఇంగ్లండ్ పర్యటన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన రిటైర్మెంట్‌పై వచ్చిన ఊహాగానలపై కూడా రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల రిటైర్మెంట్‌ను పెన్ను, పేపర్ పట్టుకొని ఖరారు చేయలేరని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి కాస్త ఘాటుగానే అన్నాడు. దాంతో రోహిత్ శర్మ ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడుతారని అంతా అనుకున్నారు.
కాని సెలక్టర్స్.. రోహిత్ శర్మని టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీ (rohit sharma test format captaincy) బాధ్యతల నుండి తప్పించాలని చూశారట. ఆటగాడిగా మాత్రమే ఇంగ్లండ్ పర్యటనకు (england tour) వెళ్లాలని అతనికి సూచించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం నచ్చని రోహిత్ శర్మ.. ఆటగాడిగా జట్టులో కొనసాగలేక రిటైర్మెంట్ ప్రకటించినట్లు (retirment anouncement) ప్రచారం జరుగుతోంది. మరోవైపు టెస్ట్ ఫార్మాట్‌లో (test format) అతని ఫామ్ కూడా గొప్పగా లేకపోవడం.. తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమని భావించే రోహిత్ గౌరవంగా తప్పుకున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూస్తుంటే త్వరలో వన్డే కెప్టెన్సీ (ODI captaincy) బాధ్యతల నుంచి కూడా రోహిత్ శర్మను తప్పించే అవకాశం ఉంది. ఇక రోహిత్ తన రిటైర్‌మెంట్‌ని ప్రకటిస్తూ.. టెస్ట్ క్యాప్ ఫోటోను సోషల్ మీడియాలో (test cap photo on social media) షేర్ చేశాడు..’ అందరికీ నమస్కారం, నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు (retiring from test cricket) మీకు తెలియజేస్తున్నాను. తెల్లటి దుస్తులలో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. సంవత్సరాలుగా మీరు నాకు అందించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. నేను వన్డే ఫార్మాట్‌లో ఆడటం మాత్రం కొనసాగిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
