అక్షరటుడే, బాన్సువాడ: Paddy Centers | ఎండిన ధాన్యం కొనుగోళ్లలో జాప్యమెందుకు చేస్తున్నారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ప్రశ్నించారు. నస్రుల్లాబాద్ (Nasrullabad) మండలం నెమ్లి శివారులో ఆదివారం వడ్ల కొనుగోలు ప్రక్రియను ఆయన పరిశీలించారు.
Paddy Centers | తేమశాతం ఉన్నప్పటికీ..
మాయిశ్చర్ మిషన్ ద్వారా పోచారం తేమ శాతాన్ని పరిశీంచారు. 14 శాతం తేమ ఉన్నప్పటికీ ఎందుకు ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆయన నిర్వాహకులను అడిగారు. కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. లారీలు అందుబాటులో లేని సమయంలో ట్రాక్టర్ల ద్వారానైనా మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని సూచించారు. రైతులకు (Farmers) ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
