107
అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని ఐదో డివిజన్ పరిధిలోని బోర్గాం(పి) శ్రీసాయి లక్ష్మీనగర్‌లో ఆర్నెళ్లుగా మిషన్ భగీరథ వాటర్ పైప్‌లైన్ (Mission Bhagiratha pipeline) లీకవుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ లీకేజీ కారణంగా భారీ గుంత ఏర్పడడంతో పలు వాహనదారులు ఈ గుంతలో పడి గాయాలపాలయ్యారని వారు పేర్కొన్నారు.
Nizamabad City | కలుషిత నీటితో అనారోగ్యాలు..
అలాగే ఈ గుంతలోనే పైప్‌లైన్ లీకేజీ (pipeline leak) నీరు నిలవడంతో తాగునీరు సైతం కలుషితంగా మారిపోతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీవాసులు ఇటీవల అనారోగ్యల పాలయ్యారని వెంటనే లీకేజీ సమస్యకు పరిష్కరించాలని కోరారు. అలాగే కాలనీలో వీధిదీపాలు లేకపోవడంతో రాత్రివేళల్లో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వారు పేర్కొన్నారు.