ePaper
More
    HomeతెలంగాణPulasa | వామ్మో.. కిలో చేపలు రూ.25 వేలా..!

    Pulasa | వామ్మో.. కిలో చేపలు రూ.25 వేలా..!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Pulasa | సాధారణంగా చేపలు చాలామందికి ఇష్టమే. కానీ, కొన్ని రకాల చేపలకు మాత్రం విపరీతమైన డిమాండ్ (High Dmand) ఉంటుంది. అటువంటి అరుదైన చేపలలో ఒకటి పులస. గోదావరి జిల్లాల (Godavari District) ప్రజలు ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ అని చెప్పే సామెత ఈ చేప ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. దీని రుచి ముందు ఏ చేప కూడా సరిపోదని అంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పులస చేప (Pulasa Fish) గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

    Pulasa | పులస – ఇలస: తేడా ఏమిటి?

    పులస, ఇలస రెండూ ఒకే రకం చేపలు అయినప్పటికీ వాటి నివాస స్థలాల బట్టి వాటికి పేర్లు వస్తాయి.

    ఇలస చేప: సముద్రంలో ఉండే చేపను ఇలస అంటారు. దీని మొప్పలు నెమలి పించం రంగులో, అంటే నీలం రంగులో ఉంటాయి. ఇవి గుడ్లు పెట్టడానికి నదుల వైపు వస్తుంటాయి. ఇలస చేపలు ఏడాది పొడవునా లభ్యమవుతాయి.

    పులస చేప: సముద్రం నుండి నదిలోకి (Sea To River) వచ్చిన ఇలస చేపే పులసగా మారుతుంది. గోదావరి నది నీరు చప్పగా ఉండటం వల్ల పులస చేప (Pulasa Fish) రంగు మారుతుంది. ఇది గోదావరి నదిలోకి రాగానే మత్స్యకారులు (Fisher mas) వీటిని పట్టుకుంటారు. ఈ చేపలు నీటికి ఎదురుగా ఈదుతూ రావడంతో వాటి కండరాలలో కొవ్వు పేరుకుపోయి, రుచి పెరుగుతుంది. అందుకే పులస చేప ధర, ఇలస చేపతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది.

    Pulasa | పులస ఎప్పుడు లభిస్తుంది?

    పులస చేపలు కేవలం జూన్ నుండి ఆగస్టు నెలల మధ్య మాత్రమే దొరుకుతాయి. ఇవి అరుదుగా లభించడం, అద్భుతమైన రుచి కలిగి ఉండటం వల్ల వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కిలో పులస చేపలు(Pulasa Fish) రూ. 25,000 వరకు కూడా అమ్ముడవుతాయి.

    Pulasa | ఎందుకంత ధర?

    పులస చేప ధర (Pulasa Fish Price) ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం దాని అరుదైన లభ్యత. అలాగే, ఈ చేపలోని కొవ్వు వల్ల వచ్చే అసాధారణమైన రుచి, దీని ప్రత్యేకతను పెంచుతుంది. అందుకే మత్స్యకారులు పులస వలలో పడితే బంగారం (Gold) దొరికినట్లుగా భావిస్తారు. అలాగే, కొంతమంది వ్యాపారులు పులస పేరుతో ఇలస చేపలను ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. కాబట్టి పులస చేపలను కొనేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది.

    Latest articles

    Peddapalli | కారులో చిక్కుకున్న చిన్నారి.. సెల్​ఫోన్ సాయంతో ప్రాణాలు కాపాడిన యువకుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Peddapalli | పెద్దపల్లి (Peddapalli) జిల్లా సుల్తానాబాద్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన చిన్న‌దిగా అనిపించిన‌,...

    Vice President | ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌.. ఇంతకీ ఎవరీయన

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Vice President | ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్డీఏ (NDA) ఖరారు చేసింది. తమిళనాడుకు చెందిన...

    Hyderabad | 128 కిలోల గంజాయి పట్టివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. పాన్​ డబ్బాల నుంచి...

    Cyberabad Police | తగ్గేదే లే అంటున్న మందుబాబులు.. ఎంత మంది చిక్కారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyberabad Police | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఏ...

    More like this