అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth | ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటన (Delhi Tour)లో ఉన్న ఆయన బుధవారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో ప్రతిపక్ష నేతలతో పాటు, జడ్జీలు, వ్యాపారులు, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో చిట్‌చాట్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. సొంత కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. ఆ పరిస్థితి వస్తే ఆత్మహత్య చేసుకోవడం మేలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
CM Revanth | మొదట ఫిర్యాదు చేసింది ఆయనే..
ఫోన్ ట్యాపింగ్‌పై మొదట ఫిర్యాదు చేసింది ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar) అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ అంశంపై విచారణ జరుగుతోందన్నారు. సిట్ అధికారులను తాను నిర్దేశించనని ఆయన స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై మొదట ప్రభుత్వం కేసు పెట్టలేదన్నారు. సామగ్రి మిస్సింగ్‌పై కేసు పెట్టిందన్నారు. అయితే లోతుగా విచారిస్తే ట్యాపింగ్ వ్యవహారం బయటపడిందని సీఎం పేర్కొన్నారు.
CM Revanth | నోటీసులు వస్తే విచారణకు వెళ్తా..
ఫోన్ ట్యాపింగ్ చట్టవ్యతిరేకం కాదని సీఎం అన్నారు. అయితే పర్మిషన్ తీసుకుని చేయాలని తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్ కాలేదని అనుకుంటున్నట్లు చెప్పారు. ట్యాపింగ్ అయి ఉంటే.. సిట్ (SIT) అధికారులు తనను పిలిచేవారన్నారు. ఒకవేళ విచారణ నోటీసులు ఇస్తే హాజరు అవుతానని ఆయన తెలిపారు.