HomeతెలంగాణAgricultural Workers Union | ఉపాధి కూలీలపై చిన్నచూపు తగదు

Agricultural Workers Union | ఉపాధి కూలీలపై చిన్నచూపు తగదు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Agricultural Workers Union | కేంద్ర ప్రభుత్వం పేదలు, ఉపాధి కూలీల పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు విమర్శించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్​ ను (Additional Collector Kiran Kumar) కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ.. ఉపాధి రంగానికి గతేడాది రూ.90వేల కోట్లు ఖర్చుపడితే, ఈ ఏడాది రూ. 86వేల కోట్లకు కుదించడం సిగ్గుచేటన్నారు. జాబ్ కార్డులు (Job Card) లేని వారందరికీ కార్డు ఇవ్వాలని, ప్రతి కూలీకి అన్ని రకాల పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజువారి కూలీ రూ.600, అలాగే పని దినాలు 200 రోజులకు పెంచాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి, సహాయ కార్యదర్శి శంకర్, చంద్రకాంత్, శేఖర్ గౌడ్, కుమార్ తదితరులున్నారు.