Homeజిల్లాలుకామారెడ్డిShabbir Ali | దేవునికి లేని అసమానతలు మనకెందుకు..? : షబ్బీర్​అలీ

Shabbir Ali | దేవునికి లేని అసమానతలు మనకెందుకు..? : షబ్బీర్​అలీ

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: దేవునికి లేని అసమానతలు మనకెందుకని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government Advisor Shabbir Ali) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ స్వామి (Markandeya Swamy) యంత్ర-మూర్తి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యంత్ర-మూర్తి ప్రాతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.

శివుడి అనుగ్రహం ద్వారా మార్కండేయుడు చిరంజీవి అయ్యాడని తెలిపారు. భగవంతునిపై నమ్మకం ఉంటే ఎవరూ మరణం నుండి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. తాను ముస్లిం అయినా మార్కండేయుడికి సేవ చేసుకునే భాగ్యం కలిగిందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.

Must Read
Related News