IPL Final
IPL Final | ఉత్కంఠ పోరులో గెలిచేదెవరో?

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: IPL Final | క్రికెట్​ ప్రేమికులకు ఎంతో ఎంటర్​టైన్​ చేసిన ఐపీఎల్​ నేటితో ముగియనుంది. మరికొద్ది సేపట్లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(RCB), పంజాబ్​ కింగ్స్​(PBKS) మధ్య ఫైనల్ మ్యాచ్​ జరగనుంది. అహ్మదాబాద్ (Ahmadabad)​ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ జట్టు బౌలింగ్​ ఎంచుకుంది.

కాగా.. ఐపీఎల్​ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు టైటిల్​ గెలవలేదు. ఇప్పటి వరకు ఆర్సీబీ మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన కప్పు దక్కించుకోలేకపోయింది. కాగా పంజాబ్​ రెండో సారి ఫైనల్​ ఆడుతోంది. ఏ జట్టు గెలిచినా తొలిసారి కప్పు అందుకోనుంది. ఈ ఉత్కంఠ పోరులో ఎవరు గెలుస్తారోనని ఐపీఎల్​ అభిమానులను టీవీలకు అతుక్కుపోయారు.