Homeక్రీడలుBumrah | బుమ్రాను మింగేసేలా చూసిన ఈ యువ‌తి ఎవ‌రు.. ఆరా తీస్తున్న క్రికెట్ ప్రియులు

Bumrah | బుమ్రాను మింగేసేలా చూసిన ఈ యువ‌తి ఎవ‌రు.. ఆరా తీస్తున్న క్రికెట్ ప్రియులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Bumrah | ఇంగ్లాండ్‌-భారత్‌ మధ్య జరిగిన టెస్ట్‌లో ఆటతో పాటు మరో సంఘటన సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ సందర్భంగా భారత్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) డగౌట్‌లో కూర్చున్న సమయంలో, ఓ యువతి ఆయన వైపు చూస్తూ నవ్వుతున్న దృశ్యం కెమెరాల్లో రికార్డయ్యింది. కాగా.. ఈ పిక్ క్షణాల్లోనే వైరల్ అయింది. బుమ్రా అభిమానులు, నెటిజన్లు “ఆమె ఎవరు?” అని ప్ర‌శ్న‌లు కురిపిస్తూనే, ఆమె గురించి ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు.

Bumrah | అలా చూస్తుందేంటి…

ఈ క్ర‌మంలో ఆమె పేరు యాస్మిన్ బాదియాని (Yasmin Badiani) అని తెలిసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు టీమ్ ఆపరేషన్స్ యూనిట్‌లో స్పోర్ట్స్ ప్రొఫెషనల్‌ (Sports Professional)గా పనిచేస్తున్నారు.

భారత జట్టు ఇంగ్లాండ్ (England) పర్యటనలో ఉన్న సమయంలో, ECB తరఫున యాస్మిన్ బాదియాని జ‌ట్టుని స‌మ‌న్వ‌యం చేసేందుకు అధికారికంగా నియమితులయ్యారు. అతిథ్య బోర్డు తరఫున ఒక కార్యనిర్వాహకుడు, సందర్శించే జట్టుకు సంబంధించి లాజిస్టిక్స్, ప్లానింగ్, ట్రావెల్ మేనేజ్‌మెంట్ వంటి బాధ్యతలను తీసుకోవడం సర్వసాధారణం. యాస్మిన్ కూడా ఇదే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు.

ఆమె బుమ్రా వైపు చూసి నవ్వినప్పటికీ, ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా ఏమీ లేదని స్పష్టమవుతోంది. ఆమె భారత జట్టుకు ట్రావెల్, శిక్షణ షెడ్యూల్స్, స్టేడియం యాక్సెస్, ఇతర అవసరాలపై సహాయం అందిస్తోంది. భారత జట్టు టీమ్ కిట్ (Indian team kit) ధరించడం కూడా ఆమె అధికారిక పనులలో భాగమే.

2010లో లీసెస్టర్ విశ్వవిద్యాలయంలో ఫిజియోథెరపీలో గ్రాడ్యుయేట్ చేసిన ఆమె హెల్త్ కేర్ రంగంలో, హారోగేట్ NHS ట్రస్ట్‌లో పనిచేశారు. 2010–2013 మధ్య లీసెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌లో స్పోర్ట్స్ ఫిజియోగా పనిచేశారు. Phizz Ltd, Clinova వంటి సంస్థల్లో కీలక స్థానాల్లో విధులు నిర్వహించారు. 2022లో ECB ఆపరేషన్స్ టీమ్‌లో చేరి.. ఇప్పటివరకు దేశీయ, విదేశీ జట్లకు ఆపరేషనల్ సపోర్ట్ అందిస్తున్నారు. ఈ ఫోటో బుమ్రా ఫ్యాన్స్‌కు కొంత స‌ర‌దా క‌లిగించొచ్చు. కానీ, వీరిద్దరి మ‌ధ్య ఎలాంటి సంబంధం లేదు అని విశ్లేష‌కులు చెప్పుకొస్తున్నారు.