అక్షర టుడే, వెబ్‌డెస్క్: New Chief Justice | భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ (Chief Justice BR Gavai) త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు. నవంబర్ 23న పదవీ కాలం ముగియనుంది.
ఈ నేపథ్యంలో కొత్త ప్రధాన న్యాయమూర్తిని నియమించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం (central government) గురువారం ప్రారంభించింది. తన వారసుడి ఎంపికకు సంబంధించి సిఫారసు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం చీఫ్ జస్టిస్ గవాయ్ కు లేఖ రాసింది. ఇది గురువారం రాత్రి లేదా శుక్రవారం ఆయనకు అందుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
New Chief Justice | సీనియర్ మోస్ట్ జడ్జికే అవకాశం..
సుప్రీంకోర్టు (Supreme Court), హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, బదిలీ, పదోన్నతిని మార్గనిర్దేశం చేసే పత్రాల ప్రకారం.. భారత ప్రధాన న్యాయమూర్తి పదవికి నియమితులయ్యే వారు సుప్రీం కోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉండాలని స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే గవాయ్ వారసుడిగా జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) నియమితులయ్యే అవకాశముంది. కొత్త చీఫ్ జస్టిస్ నియామకం కోసం పేర్లను సిఫారసు చేయాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ.. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తిని కోరుతుంది. సాధారణంగా, చీఫ్ జస్టిస్ 65 సంవత్సరాలు నిండిన తర్వాత పదవీ విరమణ చేయడానికి ఒక నెల ముందు ఈ లేఖ పంపడం ఆనవాయితీగా వస్తోంది.
New Chief Justice | కొత్త సీజేఐగా జస్టిస్ సూర్య కాంత్
భారత న్యాయ వ్యవస్థ అధిపతిగా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సూర్య కాంత్ నియమితులయ్యే అవకాశముంది. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గవాయ్ తర్వాత ఆయనే అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. నవంబర్ 23న గవాయ్ పదవీ విరమణ చేయనుండగా, జస్టిస్ సూర్యకాంత్ 24న బాధ్యతలు చేపడతారని తెలిసింది. ఆయన చీఫ్ జస్టిస్ గా 2027 ఫిబ్రవరి 9 వరకు అంటే దాదాపు 15 నెలల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.

