అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. ఈ స్థానంలో ఎలాగైన విజయం సాధించాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చూస్తున్నాయి.
జూబ్లీహిల్స్(Jubilee Hills) నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే గులాబీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ సైతం ముగ్గురి పేర్లను హైకమాండ్‌కు పంపింది. బీజేపీ కూడా అభ్యర్థిని బుధవారం ఖరారు చేయనున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం సోమవారం సాయంత్రం ఎన్నికల సంఘం(Election Commission) నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో పార్టీలను అభ్యర్థులను ఫైనల్ చేయడానికి చర్యలు చేపట్టాయి.
Jubilee Hills | రేసులో ఉంది వీరే..
బీజేపీ(BJP) రాష్ట్ర ఎన్నికల కమిటీ మంగళవారం సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పలువురి పేర్లను పరిశీలించి కేంద్ర నాయకత్వానికి పంపనుంది. దీంతో బుధవారం కమలం పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా టికెట్ రేసులో వీరపనేని పద్మ, జూటూరు కీర్తిరెడ్డి, లంకల దీపక్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో దీపక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) సమయంలో పోటీ చేసి మూడోస్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయన బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వకపోతే కీర్తిరెడ్డి ఇస్తారని సమాచారం. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సన్నిహితంగా ఉన్న వీరిలో ఒకరికి టికెట్ వస్తుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Jubilee Hills | తీవ్రంగా పోటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తీవ్రంగా పోటీ ఉంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్(BRS) చూస్తోంది. ఇప్పటికే కేటీఆర్ నియోజకవర్గంలో పలుమార్లు పర్యటించారు. మరోవైపు కాంగ్రెస్(Congress) సైతం ముగ్గురు ఇంఛార్జి మంత్రులను, 18 పరిశీలకును ఎన్నికల కోసం నియమించింది. నిత్యం నియోజకవర్గంలో మంత్రులు పర్యటిస్తున్నారు. మరోవైపు ఈ స్థానంలో గెలిచి సత్తా చాటాలని బీజేపీ సైతం భావిస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నవీన్‌యాదవ్, సీఎన్ రెడ్డి పేర్లను అధిష్టానానికి పంపారు. వీరిలో టికెట్ ఎవరిని వరిస్తుందో చూడాలి.
1 comment
[…] ఎన్నికలలో (Jubilee Hills Elections) పార్టీ అభ్యర్థిని జాతీయ […]
Comments are closed.