అక్షరటుడే, వెబ్‌డెస్క్: MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖతో పాటు ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో కల్లోలం సృష్టించాయి. ఆమె లేవనెత్తిన ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాలతో పాటు గులాబీ పార్టీలో (Gulabi Party) కలకలం రేపాయి.
కవిత రాసిన లేఖపై (Kavita letter) బీఆర్ఎస్ నుంచి స్పందన కరువైంది. గురువారం సాయంత్రం లెటర్ బయటకు రాగా, శుక్రవారం రాత్రి వరకు గులాబీ పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. అదే సమయానికి అమెరికా నుంచి హైదరాబాద్‌లో (Hyderabad) దిగిన కవిత.. మరోసారి పార్టీ తీరుపై, తనపై జరుగుతున్న కుట్రలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని, పార్టీలో లోటుపాట్లను సరిదిద్దుకోవాల్సి ఉందని, కోవర్టులను పక్కన పెడితేనే పార్టీ బాగుంటుందని కుండబద్దలు కొట్టారు. కవిత తాజా వ్యాఖ్యలను బట్టి కేసీఆర్ (KCR) కుటుంబలో అంతర్గత పోరు తీవ్రమైందా? కవితపై కావాలనే కుట్రలు జరుగుతున్నాయా? అసలు బీఆర్ఎస్‌లో (BRS) ఏం జరుగుతోంది? అంతర్గత కలహాలకు కారణమేంది? ఇప్పుడివే ప్రశ్నలు ఇటు రాష్ట్ర రాజకీయాలతో (state politics) పాటు గులాబీ శ్రేణుల్లోనూ చర్చనీయాంశమయ్యాయి.
MLC Kavitha | కేటీఆర్, సంతోష్‌లేనా?
కేసీఆర్ (KCR) దేవుడు అంటూనే ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని కవిత చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్నది ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. తనపై కుట్ర జరుగుతోందని కవిత స్పష్టంగా చెప్పారు. అసలు తాను అంతర్గతంగా రాసిన లేఖ (letter) బయటకు ఎలా వచ్చిందో తెలియదని, దాని వెనుక ఎవరు ఉన్నారో తెలియదని చెప్పారు. లెటర్ బయటకు రావడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు వస్తే.. పార్టీలో ఇక సామాన్యుల (common people) పరిస్థితి ఏమిటని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. తన సోదరుడు కేటీఆర్‌తో (KTR) పాటు సంతోష్‌ను ఉద్దేశించే ఆమె వ్యాఖ్యానించారన్న ప్రచారం జరుగుతోంది. తన రాజకీయ ఆశయాలకు అడ్డం పడుతున్నది ఈ ఇద్దరే అన్న ఉద్దేశంతోనే కవిత తాజా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. బీఆర్ఎస్‌లో కేసీఆర్ తర్వాత కేటీఆరే కాబోయే నాయకుడు అన్న రీతిలో హైప్ క్రియేట్ చేశారు. మరోవైపు, కేసీఆర్‌ను ఎవరు కలవాలి, ఎవరు కలువొద్దనేది సంతోష్ (Santhosh) ఒక్కరే చూసుకుంటారు. కేసీఆర్ వ్యక్తిగత అవసరాలను దగ్గరుండి చూసుకునే సంతోష్, పార్టీకి కాబోయే భావి సారథి కేటీఆర్ వల్లే తనకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్నది కవిత ఆలోచనగా చెబుతున్నారు. ఈ ఇద్దరిని ఉద్దేశించే ఆమె తాజా వ్యాఖ్యలు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
MLC Kavitha | లోపాలా.. ఆధిపత్య పోరా?
బీఆర్ఎస్‌లో నిజంగానే లోపాలున్నాయా? మొన్నటి ఎన్నికల్లో (last elections) ఓటమికి పార్టీలో లోపాలే కారణమా? లేక అంతర్గత పోరే కారును పంక్చర్ చేసిందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. పార్టీలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని, వాటి గురించి చర్చించుకోవాల్సిన అవసరముందని కవిత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కోవర్టులతోనే పార్టీకి నష్టమని, వారిని పక్కకు తప్పిస్తేనే పార్టీ బాగుపడుతుందని కవిత వ్యాఖ్యానించడం వెనుక ఉన్న కారణాలపై ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో గుసగుసలు మొదలయ్యాయి.
ఆ కోవర్టులు ఎవరు? పార్టీని దెబ్బ తీస్తుంటే కేసీఆర్ ముద్దుల తనయగా.. ఆమె తన తండ్రి దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీలో ప్రధానంగా కుటుంబంలోనే పొరపొచ్చాలు వచ్చాయని, అన్నా చెల్లె మధ్య దూరం పెరిగిందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కేటీఆర్, సంతోష్ (KTR and Santhosh) ఒక్కటయ్యారని, లిక్కర్ స్కామ్ (liquor scam) తర్వాత కవితకు క్రమంగా పార్టీలో ప్రాధాన్యం తగ్గిస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. ఇది ఏమాత్రం నచ్చని కవిత తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నారని, అందులో భాగంగానే తాజా పరిణామాలు నిదర్శనమని తెలుస్తోంది.