అక్షరటుడే, వెబ్‌డెస్క్: Jammu and Kashmir | ఢిల్లీ పేలుడు (Delhi blast) ఘటనతో అప్రమత్తమైన భారత రక్షణ బలగాలు దేశవ్యతిరేక శక్తుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఇందులో భాగంగా వైట్ కాలర్ టెర్రరిజంపై కూడా దృష్టి సారించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్‌లోని (Jammu and Kashmir) ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న హరియాణాకు చెందిన వైద్యురాలు ప్రియాంక శర్మను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జైషే మహమ్మద్, అన్సార్ గజ్‌వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్న వైద్యులు ముజమ్మిల్ షకీల్, షాహిన్, అదీల్ అహ్మద్‌లను ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరైన అదీల్ అహ్మద్‌తో ప్రియాంక శర్మకు (Priyanka Sharma) పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది.
Jammu and Kashmir | వసతి గృహంపై దాడి చేసి..
అనంత్‌నాగ్‌లో నివాసం ఉన్న ప్రియాంక వసతి గృహంపై దాడి చేసి.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఆమె మొబైల్ ఫోన్‌తో పాటు సిమ్ కార్డును ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లోని కళాశాలలు, యూనివర్సిటీల్లో చదువున్న కశ్మీర్ విద్యార్థులపై (Kashmiri students) నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
Jammu and Kashmir | ఢిల్లీ పేలుడు ఘటనతో..
ఢిల్లీలోని ఎర్రకోటకు (Red Fort) సమీపంలో ఇటీవల కారు పేలుడుతో దేశం ఉలిక్కిపడింది. ఈ పేలుడుకు కారణమైన కారును నడిపిన వ్యక్తి డాక్టర్ ఉమర్ నబీగా పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. కాగా.. అతడితో సంబంధాలున్న ఐదుగురు వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. వారందరికీ ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నట్లు గుర్తించారు.
దీంతో వారితో కలిసి చదువుకున్న, పని చేస్తున్న ఇతర డాక్టర్లపైనా ఫోకస్ పెట్టారు. ఉగ్ర కుట్రలో ఫరీదాబాద్‌లోని అల్-ఫలా వర్సిటీ సిబ్బంది పాత్ర ఉండడం.. నిందితులకు సంబంధించి మరో కారు అక్కడే లభ్యం కావడంతో క్యాంపస్‌లో (Al Falah University) భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే వర్సిలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. కాగా.. అదే కాలేజీలో చదువుతున్న మరో ఇద్దరిని సైతం ఎన్‌ఐఏ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది.
