అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: locking the door.. stealing | నిజామాబాదులో దొంగలు విరుచుకుపడుతున్నారు. నగరంలోని పోలీసుల పెట్రోలింగ్, పహారా, బందోబస్తును దుండగులు లెక్కచేయడం లేదు. ఇంట్లో నిద్రిస్తుండగానే దర్జాగా తమ పని కానిచేస్తున్నారు.
ఇలాంటి ఘటన నిజామాబాద్ (Nizamabad) నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలోని మహాలక్ష్మి నగర్ లో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనే దుండగులు లోపలికి ప్రవేశించారు.
ఇంట్లో ఉన్నవారు నిద్రిస్తున్న గదికి గడియ పెట్టి ఉన్నదంతా దోచుకున్నారు. మహాలక్ష్మి నగర్ లో నివాసముంటున్న దేవసాని విట్టల్ తన ఇంట్లో పూజ చేసుకుని బంధువులందరూ వెళ్లిపోయాక, కుటుంబ సభ్యులందరూ ఒక గదిలో నిద్రిస్తున్నారు.
locking the door.. stealing : కిటికీలో నుంచి ప్రవేశించి..
కాగా, ఆదివారం ఉదయం ఇంటి కిటికీని పగులగొట్టి లోపలికి ప్రవేశించారు దుండగులు. విట్టల్ కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గడియ పెట్టారు. అనంతరం బీరువాలో ఉన్న 12 తులాల బంగారం, 30 తులాల వెండిని దోచుకెళ్లారు.
ఉదయం పాలు పోసే వ్యక్తి (milkman) వచ్చి గడియ తీయడంతో బయటకు వచ్చిన విట్టల్.. నాలుగో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.