అక్షరటుడే, వెబ్‌డెస్క్ : NIACL Notification | ప్రభుత్వ రంగ బీమా కంపెనీ అయిన ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(AO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జనరలిస్టిక్‌తో పాటు స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ (Degree) అర్హతతో భర్తీ చేసే ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 90 వేల వేతనం పొందవచ్చు. నోటిఫికేషన్(Notification) వివరాలిలా ఉన్నాయి.
భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 550.
NIACL Notification | పోస్టులవారీగా వివరాలు..
రిస్క్ ఇంజినీర్ – 50, ఆటోమొబైల్ ఇంజినీర్ -75, లీగల్ స్పెషలిస్ట్ – 50, అకౌంట్ స్పెషలిస్ట్ -25, ఏవో(హెల్త్) -50, స్పెషలిస్ట్(ఐటీ) -25, బిజినెస్ అనలిస్ట్ -75, కంపెనీ సెక్రటరీ -2, యాక్చ్వేరియల్ స్పెషలిస్ట్ -5, జనరలిస్ట్ -193 పోస్ట్‌లు.
వయో పరిమితి : ఆగస్టు ఒకటో తేదీ నాటికి కనీసం 21 ఏళ్ల వయసుండాలి. గరిష్ట వయో పరిమితి 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ(OBC) మూడేళ్లు, పీవోడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హత : జెనరలిస్ట్ ఏవో పోస్టులకు ఏదైనా విభాగంలో డిగ్రీ/పీజీ పూర్తి చేసి ఉండాలి. జనరల్(General) అభ్యర్థులు కనీసం 60 శాతం, మిగిలినవారు 55 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి.
స్పెషలిస్ట్ ఏవో(అకౌంట్స్) పోస్టులకు చార్టర్డ్ అకౌంటెంట్
స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ(MBA), ఎంబీబీఎస్, బీడీఎస్, ఎండీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ పూర్తి చేసినవారు అర్హులు. జనరల్ అభ్యర్థులు కనీసం 60 శాతం, మిగిలిన కేటగిరీలవారు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వేతన వివరాలు..
వేతన శ్రేణి రూ. 50,925 నుంచి రూ. 96,765. అన్ని అలవెన్స్‌లు కలుపుకుని మెట్రో నగరాలలో రూ. 90 వేల వరకు ప్రారంభ వేతనం అందుతుంది.
దరఖాస్తు గడువు : ఆగస్టు 30.
దరఖాస్తు రుసుము : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 850 ఫీజు(జీఎస్టీ అదనం) చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ, పీవోడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం www.newindia.co.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
క్విక్ హెల్ఫ్‌పై క్లిక్ చేసి రిక్రూట్‌మెంట్‌ను ఎంచుకోవాలి.
‘రిక్రూట్‌మెంట్ – ఏవో 2025’ పై క్లిక్ చేయాలి.
వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. దరఖాస్తు ఫారాన్ని నింపి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించి, సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి.
ఎంపిక విధానం..
ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు.
ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : సెప్టెంబర్ 14.
మెయిన్స్ పరీక్ష తేదీ : అక్టోబర్ 29.