153
అక్షరటుడే, ఇందూరు: Education Department | నగరంలోని నకాష్ గల్లి ప్రాథమికోన్నత పాఠశాల (Nakash Galli Upper Primary School) పరిస్థితి దారుణంగా తయారైంది. పాఠశాలలో ఉన్న ఐదుగురు ఉపాధ్యాయుల్లో ఇద్దరు ఎన్నికల విధులకు వెళ్లగా మరో ముగ్గురు సెలవులో ఉన్నట్లు సమాచారం. దీంతో పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకుండానే తరగతులు కొనసాగుతున్నాయి.
Education Department | అన్ని చూసుకుంటున్న విద్యార్థిని..
పాఠశాలలో ఫేషియల్ అటెండెన్స్ (facial attendance system) కూడా ఏడో తరగతి విద్యార్థిని తీసుకోవడం గమనార్హం. విద్యార్థినికే గత రెండు రోజులుగా అటెండెన్స్ ట్యాబ్ అప్పజెప్పినట్లు సమాచారం. అయితే షఫీ అనే సీఆర్పీకి పాఠశాలను అప్పజెప్పినట్లు తెలిసింది.. కానీ ఆయన కూడా ఆలస్యంగా వచ్చి తొందరగా వెళ్తున్నట్లు సమాచారం.