Miss World 2025
Miss World 2025 | థాయ్‌లాండ్ బ్యూటీకి మిస్ వ‌ర‌ల్డ్ కిరీటం.. అత్యంత అందమైన అమ్మాయిలు ఏ దేశంలో ఉంటారంటే..!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Miss World 2025 | భాగ్యనగరంలోని హైటెక్స్ వేదికగా (Hitex venue) 72వ మిస్‌ వరల్డ్ ఫైనల్స్ (Miss World Grand Finale) కార్యక్రమం శనివారం అట్టహాసంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 108 మంది మగువలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సుమారు 20 రోజులపాటు జరిగిన వివిధ కార్యక్రమాల్లో అందాల భామలు పాల్గొని తమ ప్రతిభను చాటడంతోపాటు, తెలంగాణలో ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను (famous tourist and spiritual places) సందర్శించారు. తెలంగాణ జరూర్ ఆనా (Telangana Zaroor Aana) నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. ఫినాలేలో 40 మంది సుందరీమనులు పోటీపడగా, టాప్ 40లో 16 బెర్త్‌లు ముందే ఖరారయ్యాయి.

Miss World 2025 | అంద‌మైన భామ‌లు ఎవ‌రంటే..

బ్యూటీ విత్ ఏ పర్సస్‌లో విజేతలుగా మిస్ ఇండోనేషియా (Miss Indonesia), మిస్ వేల్స్, మిస్ ఉగాండ (Miss Wales and Miss Uganda) నిలిచారు. బ్యూటీ విత్ ఏ పర్సస్, టాలెంట్ ఈవెంట్ రెండింట్లోనూ మిస్ ఇండోనేషియా మోనిక కేజియా గెలిచారు. స్పోర్ట్స్ ఈవెంట్‌లో విజేతగా మిస్ ఎస్తోనియా (Miss Estonia) నిలిచారు. హెడ్-టు-హెడ్ రౌండ్‌లో మిస్ టర్కీ (Miss Turkey) గెలుపొందారు. ఫ్యాషన్ గ్రాండ్ ఫినాలేలో టాప్ మోడల్‌గా మిస్ ఇండియా నందినీ గుప్తా (Miss India Nandini Gupta) నిలిచారు. 108 మంది పోటీదారుల్లో ప్రతి ఖండం(అమెరికా & కరీబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా & ఓషియానియా) నుంచి 10 మంది సెమీఫైనలిస్టులు, మొత్తం 40 మంది క్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు. కొందరు పోటీదారులు ఫాస్ట్-ట్రాక్ ఛాలెంజ్‌ల ద్వారా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌‌కు చేరుకున్నారు.

క్వార్టర్ ఫైనల్స్ నుంచి, ప్రతి ఖండం నుంచి టాప్ 5, ఆ తర్వాత టాప్ 2, చివరిగా విజేతలను ఎంపిక చేశారు. చివరి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ద్వారా కొత్త మిస్ వరల్డ్​ను ఎన్నుకున్నారు. అయితే ఈ సారి మిస్ వ‌ర‌ల్డ్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత (Opal Suchata from Thailand) విజేతగా నిలిచింది. మిస్ వరల్డ్ 2025 (Miss World 20250 కిరీటాన్ని కైవసం చేసుకుంది. 107 దేశాలకు చెందిన అందాల భామలతో పోటీ పడి సుచాత విజేతగా నిలిచింది. 2021 నుంచి అందాల పోటీల్లో పాల్గొంటోంది. గతంలో మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ 2024 విజేతగా నిలిచింది. అయితే థాయ్‌లాండ్‌కు చెందిన భామ మిస్ వ‌రల్డ్‌గా (Miss world) ఎంపిక కాగా, ఈ స‌మ‌యంలో అత్యంత అందమైన అమ్మాయిలు ఎక్క‌డున్నార‌నే చ‌ర్చ మొద‌లైంది. సౌత్ కొరియాకు (South Korea) చెందిన మహిళలు ఎంతో బ్యూటిఫుల్‌గా ఉంటారని ‘ఇన్‌సైడర్ మంకీ’ రిపోర్టులో తేలింది. టాప్-50 దేశాల జాబితాలో ఇండియా 18వ స్థానంలో నిలిచింది. సౌత్ కొరియా తర్వాత బ్రెజిల్, అమెరికా, జపాన్, మెక్సికో, జర్మనీ, కొలంబియా, థాయ్‌లాండ్, ఇటలీ, వెనిజుల దేశాలు టాప్-10లో ఉన్నాయి. థాయ్ లాండ్ దేశం 8వ స్థానాన్ని ద‌క్కించుకుంది.