అక్షర టుడే, కామారెడ్డి: Kamareddy | తమను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీని నెరవేర్చాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ (General Secretary Satyanarayana) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
హామీ ఇచ్చి రెండేళ్లు గడిచిందని, కానీ అమలు ఎప్పుడు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామన్న హామీ ఉత్తదేనా అని అన్నారు. క్రమబద్ధీకరణ, పే స్కేలు, 20 శాతం వెయిటేజీ, రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
రాష్ట్ర విద్యాశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో 18 ఏళ్లుగా పనిచేస్తున్న 19,600 మంది ఉద్యోగులు తమ జీవనోపాధి కోసం నిరంతరం పోరాడుతున్నారని, కానీ రెగ్యులరైజేషన్ అనే హామీ ఇప్పటికీ నెరవేరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.