అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Inter Exams | ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు అధికారులు శనివారం విడుదల చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
ఇంటర్ బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య శనివారం పరీక్షల వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, 26 నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. మార్చి 18 వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఈ ఏడాది మొత్తం 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు (Inter Exams) రాయనున్నారు.
Inter Exams | సిలబస్‌లో మార్పులు
ఈ సంవత్సరం పరీక్ష షెడ్యూల్‌తో పాటు సిలబస్‌లోనూ విద్యాశాఖ (Education Department) కీలక మార్పులు చేసింది. ప్రతి సంవత్సరం మార్చిలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యేవి. అయితే ప్రస్తుతం ఫిబ్రవరి 25 నుంచే ప్రారంభం కానున్నాయి. అలాగే సిలబస్‌లోనూ మార్పులు చేశారు. వచ్చే ఏడాది నుంచి సిలబస్ మార్పులు అమలులోకి రానున్నాయి. అలాగే ఫస్టియర్‌లోనూ ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ను పెట్టనున్నట్లు కృష్ణ ఆదిత్య తెలిపారు.
Inter Exams | ఎన్సీఈఆర్టీ సూచనల ప్రకారం..
ఇంటర్ సిలబస్‌లో 12 సంవత్సరాల తర్వాత మార్పులు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రెటరీ (Inter Board Secretary) తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్‌లోనూ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. NCERT సబ్జెక్టు కమిటీ సూచనల ప్రకారం మార్పులు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 40 నుంచి 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ఏసీఈ కోర్సు ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించారు. నవంబర్ 1 నుంచి ఇంటర్ విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు వసూలు చేస్తామన్నారు.
