అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Sanjay | జూబ్లీహిల్స్ ఎన్నిక (Jubilee Hills election) నేపథ్యంలో ప్రచారం జోరందుకుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా మద్దతుగా బోరబండలో ప్రచారం చేశారు.
బోరబండ (Borabanda)లో బండి సంజయ్ ప్రచారానికి మొదట అనుమతి ఇచ్చిన పోలీసులు గురువారం ఉదయం రద్దు చేశారు. దీనిపై బీజేపీ (BJP) శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడం, సమావేశం పెట్టి తీరుతామని బండి సంజయ్ ప్రకటించడంతో మళ్లీ అనుమతి ఇచ్చారు. దీంతో కేంద్ర మంత్రి సంజయ్, ఎంపీ డీకే అరుణ (MP DK Aruna)తో కలిసి దీపక్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్పై విమర్శలు చేశారు.
Bandi Sanjay | జూబ్లీహిల్స్‌లో గెలుస్తాం
జూబ్లీహిల్స్‌లో బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తారని బండి సంజయ్ అన్నారు. తమకు పర్మిషన్లతో పని లేదన్నారు. తాము మీటింగ్ పెట్టుకుంటామంటే ఎందుకు అంత భయమని ఆయన ప్రశ్నించారు. బోరబండ మీటింగ్‌కు పర్మిషన్లు ఇచ్చి క్యాన్సిల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలోనే మీటింగ్ పెట్టిన చరిత్ర బీజేపీదన్నారు. జూబ్లీహిల్స్‌లో కాషాయ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌కు ఓడిపోతామని అర్థం అయిందని బండి సంజయ్ విమర్శించారు. అందుకే ముస్లింలను జోకుతున్నారని పేర్కొన్నారు. ఎలక్షన్లు రాగానే ముస్లింల టోపీ పెట్టుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటు అయిందన్నారు. ఎక్కడ ఎన్నికలు వచ్చిన టోపీ పెట్టుకోవడం, పాకిస్థాన్‌ను పొగుడుతున్నారని ఆరోపించారు. తాను హిందు ఓటు బ్యాంకును సంఘటితం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఇతర మతాలను కించపర్చనన్నారు. అదే సమయంలో టోపీ పెట్టుకొని ఓట్లు అడగాల్సిన రోజు వస్తే తల నరుక్కుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
1 comment
[…] సంపాదిస్తున్నారని బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. అమాయక దళిత, గిరిజనులను […]
Comments are closed.