అక్షరటుడే, ఎల్లారెడ్డి/ఆర్మూర్ : Children’s Day | బాలల దినోత్సవాన్ని ఉమ్మడిజిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో స్వయంపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు.
విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ పాఠశాలల్లో సందడి చేశారు. ఎల్లారెడ్డి మోడల్ స్కూల్ (Yellareddy Model School)లో బాలల దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. దివంగత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవం పురస్కరించుకొని బాలల దినోత్సవం (Children’s Day) సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ విద్యార్థులు సానియా. మధుమిత, ప్రజ్ఞ్య, వసంత, పాఠశాల ప్రిన్సిపల్ గాంధీ, అధ్యాపకులు జహంగీర్, ప్రియదర్శిని రాజశేఖర్, లక్ష్మణ్ సింగ్, విద్యారమణ తదితరులు పాల్గొన్నారు.
Children’s Day | ఎల్లారెడ్డిలోని మల్లాయిపల్లి..
అక్షరటుడే,ఎల్లారెడ్డి : మండలంలోని మల్లాయిపల్లి ప్రాథమిక పాఠశాల (Mallaipalli Primary School)లో శుక్రవారం బాలల దినోత్సవాన్ని పాఠశాల హెచ్ఎం విశ్వనాథం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చాచా నెహ్రూ వేషధారణలలో అలరించారు. ఈ సందర్భంగా హెచ్ఎం విశ్వనాథం మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా మార్చే దిశగా విద్యా బోధన కొనసాగుతుందన్నారు. పిల్లల నవ్వే భారత భవిత, చాచా నెహ్రూ చూపిన ప్రేమే విద్యకు ప్రేరణ అని పేర్కొన్నారు.
![]()
చిన్నారుల్లో ఉన్న సృజన, అమాయకత్వం, తెలుసుకోవాలనే తపననే నిజమైన జాతీయ సంపదగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చాచా నెహ్రూ వేషధారణలో అలరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, యూత్ సభ్యులు, పాఠశాల సహోపాధ్యాయులు పిల్లల ప్రతిభను అభినందించారు.
Children’s Day | ఆర్మూర్‌లోని ఆలూర్‌లో..
ఆలూర్ మండల కేంద్రంలోని శ్రీ హైస్కూల్ (Sri High School)లో శుక్రవారం చిల్డ్రన్స్ డే వేడుక (Children’s Day Celebrations)లను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. బాలల దినోత్సవం పిల్లల సృజనాత్మకత, ప్రతిభను వెలికితీయడానికి ఒక మంచి వేదిక అని అన్నారు. ప్రతివిద్యార్థి తనలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేసి క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ , తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
![]()
