ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | వానొచ్చెనంటే వరదొస్తది.. కామారెడ్డిలో అస్తవ్యస్తంగా డ్రెయినేజీలు

    Kamareddy | వానొచ్చెనంటే వరదొస్తది.. కామారెడ్డిలో అస్తవ్యస్తంగా డ్రెయినేజీలు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కామారెడ్డి ప్రజలు వర్షం అంటే వణికిపోతున్నారు. కొద్దిపాటి వాన పడిందంటే చాలు పట్టణం(kamareddy town)లో వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. చిన్నపాటి వానకే పలు కాలనీల్లోకి వరద నీరు ముంచెత్తుతుంది. డ్రెయినేజీలు (drainages) సక్రమంగా లేక కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకుంటున్నాయి. తిరిగి వర్షాకాలం సీజన్ మొదలైన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    కామారెడ్డి జిల్లా కేంద్రం(kamareddy town) రోజురోజుకు విస్తరిస్తోంది. కానీ అందుకు తగినట్లు వసతులు పెరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం కావడంతో పట్టణ రూపురేఖలు మారిపోతాయని, సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు భావించారు. కానీ, ఇప్పటికీ డ్రెయినేజీలు (drainages) సక్రమంగా నిర్మించకపోవడంతో వానాకాలంలో పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

    READ ALSO  RTC tour packages | ఆర్టీసీ టూర్​ ప్యాకేజీలకు ఆదరణ

    Kamareddy | నీట మునుగుతున్న కాలనీలు

    పట్టణంలోని విద్యానగర్, అశోక్ నగర్, బతుకమ్మ కుంట కాలనీలు ఏటా వానాకాలంలో నీట మునుగుతున్నాయి. వరద నీరు వెళ్లే మార్గం లేక ఇళ్లలోకి నీరు చేరుతోంది. డ్రెయినేజీ నీరు (Drainage water), వరద నీరు ఇళ్లలోకి చేరగా.. ప్రజలు ఈ సీజన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం కురిసిన ప్రతీసారి నిజాంసాగర్ చౌరస్తా వద్ద రోడ్డుపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

    Kamareddy | ఏళ్లుగా పరిష్కారం శూన్యం

    కామారెడ్డి మున్సిపాలిటీలో (Kamareddy Municipality) ఏడు గ్రామాల విలీనంతో పట్టణం మరింత విస్తరించింది. కానీ వరద నీటి సమస్య (water problem) పరిష్కారానికి మాత్రం అధికారులు చర్యలు చేపట్టడం లేదు. పట్టణంలో అరగంట పాటు వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో అడుగు లోతులో వరద నీరు నిలుస్తోంది. ఈసారి ముందస్తు వర్షాలు మొదలయ్యాయి. అయినప్పటికీ.. ఆయా ప్రాంతాల్లో ఇప్పటి వరకు వరద కాల్వల నిర్మాణం చేపట్టలేదు. దీంతో ఈ సీజన్లో కూడా తమకు వరద నీటితో ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    READ ALSO  Jukkal congress | కాంగ్రెస్​ రాష్ట్ర ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్​తో జుక్కల్​ ​నాయకుల భేటీ

    Latest articles

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు...

    More like this