HomeతెలంగాణGPO Posts | జీపీవో పోస్టులకు పరీక్ష.. ఎప్పుడంటే..!

GPO Posts | జీపీవో పోస్టులకు పరీక్ష.. ఎప్పుడంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: GPO Posts | గ్రామ పాలన అధికారుల GPO నియామకంపై కీలక అప్​డేట్​ వచ్చింది. జీపీవో పోస్టుల భర్తీ కోసం మే 25న స్క్రీనింగ్​​ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో కాంగ్రెస్​ congress అధికారంలోకి వచ్చాక భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపింది. ఈ క్రమంలో ధరణి Dharani స్థానంలో భూ భారతి Bhu Bharati పోర్టల్​ అమలులోకి తీసుకొచ్చింది. భూ భారతి అమలుకు జీపీవోలు కీలకం అని ప్రభుత్వం భావిస్తోంది.

GPO Posts | 6,120 దరఖాస్తులు

గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం జీపీవోలను నియమించాలని ప్రభుత్వం భావించింది. మొత్తం 10,941 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించింది.ఇందుకోసం గతంలో వీఆర్​వో vro, వీఆర్​ఏ vraలుగా పని చేసిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే 6,120 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరికి స్క్రీనింగ్​ పరీక్ష నిర్వహించిన అనంతరం నియామక పత్రాలు అందించనున్నారు.

వీరికి మే 25న ఉదయం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. హాల్​టికెట్లను halltickets త్వరలోనే ఆన్​లైన్​లో విడుదల చేసే అవకాశం ఉంది. పోస్టుల కంటే తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వీఆర్​వో, వీఆర్​ఏ, గ్రామస్థాయి రెవెన్యూ అంశాలపై పరీక్ష పెట్టి వారిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మిగతా పోస్టులను డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది.