ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Inter Supplementary exams | ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..

    Inter Supplementary exams | ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter Supplementary exams |తెలంగాణలో ఇంటర్​ పరీక్ష ఫలితాలు ఏప్రిల్​ 22న విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్​ ఫస్టియర్​లో 65.96 శాతం, సెకండియర్​లో 65.65 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. అయితే ఈ పరీక్షల్లో ఫెయిల్​ అయిన వారికి త్వరలో సప్లిమెంటరీ పరీక్షలు(Supplementary exams) నిర్వహించనున్నారు. మే 22 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు త్వరలోనే హాల్​టికెట్లు కూడా విడుదల కానున్నాయి.

    సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4,12,724 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఫస్టియర్‌ జనరల్‌ విద్యార్థులు 2,49,032 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 16,994 మంది ఉన్నారు. ఫస్టియర్​ విద్యార్థుల్లో ఫెయిల్​ అయిన వారితో పాటు మార్కులు పెంచుకోవడానికి ఇంప్రూవ్​మెంట్(Improvement)​ రాసే వారు కూడా ఉంటారు. సెకండియర్​ సప్లిమెంటరీ పరీక్షలకు జనరల్‌ విద్యార్థులు 1,34,341 మంది, ఒకేషనల్‌ పరీక్షలకు 12,357 మంది హాజరుకానున్నారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి 29 వరకు కొనసాగనున్నాయి.

    Inter Supplementary exams | టైం టేబుల్​ ఇదే..

    ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం ఫస్టియర్​ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్​ విద్యార్థులు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

    మే 22న సెకండ్​ లాంగ్వేజీ, 23న ఇంగ్లిష్​ పరీక్ష ఉంది. 24న మ్యాథ్స్​–ఏ, బోటని, పొలిటికల్​ సైన్స్​, 25న మ్యాథ్స్​ బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షలు ఉన్నాయి. 26న ఫిజిక్స్​, ఎకనామిక్స్​, 27న కెమిస్ట్రీ, కామర్స్, 28న పబ్లిక్​ అడ్మినిస్ట్రేషన్​, బ్రిడ్జి కోర్స్​ మ్యాథ్స్​, 29న మోడర్న్​ లాంగ్వేజీ, జియోగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు.

    Latest articles

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    SI Sunil | సైబర్​ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, కోటగిరి: SI Sunil | ప్రజలు సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సునీల్ సూచించారు....

    BRS | బీఆర్​ఎస్​కు మరో షాక్.. పార్టీని వీడనున్న 10 మంది మాజీ ఎమ్మెల్యేలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | బీఆర్​ఎస్​ పార్టీకి మరో షాక్​ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పది మంది...

    More like this