Homeభక్తిTirumala | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. జనవరి దర్శన కోటా టికెట్ల బుకింగ్స్​ ఎప్పుడంటే?

Tirumala | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. జనవరి దర్శన కోటా టికెట్ల బుకింగ్స్​ ఎప్పుడంటే?

Tirumala | శ్రీవారి దర్శనానికి సంబంధించి జనవరి టికెట్ల కోటా, బుకింగ్​ వివరాలను టీటీడీ వెల్లడించింది. భక్తులు గమనించాలని సూచించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. భక్తుల కోసం టీటీడీ (TTD) ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో దర్శన టికెట్లను అందిస్తోంది. తాజాగా జనవరి కోటా (January Darshan Quota)కు సంబంధించిన టికెట్ల వివరాలను వెల్లడించింది.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు, అంగ ప్రదక్షిణ టోకెన్ల జనవరి కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబర్ 21 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లిస్తే టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి.

Tirumala | ఆర్జిత సేవా టికెట్లు..

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయ‌నుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అధికారులు ఆన్​లైన్​లో ఉంచనున్నారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.

Tirumala | వృద్ధులు, దివ్యాంగుల కోసం..

స్వామి వారిని దర్శించుకునే వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌ వారి కోసం టీటీడీ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. వీరికి ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు.