Homeతాజావార్తలుWhatsApp | వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. త్వరలో నంబర్‌ ఇవ్వకుండానే చాట్‌ చేయొచ్చు!

WhatsApp | వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. త్వరలో నంబర్‌ ఇవ్వకుండానే చాట్‌ చేయొచ్చు!

వాట్సాప్‌ కొత్త యూజర్‌ నేమ్‌ ఫీచర్‌ను తీసుకువస్తోంది. దీనితో ఇకపై తమ మొబైల్‌ నంబర్‌లను పంచుకోకుండానే మరో యూజర్‌తో చాట్‌ చేసుకునే వెసులుబాటు ఉండనుంది. ఇది వ్యక్తిగత సమాచారం గోప్యతను పెంచుతుందని భావిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Whatsapp | ప్రస్తుత కాలంలో వాట్సాప్‌ (Whatsapp) వినియోగం గణనీయంగా పెరిగింది. దాదాపు అందరూ ఈ సోషల్‌ మెస్సెంజర్‌ యాప్‌ను వినియోగిస్తున్నారు. సాధారణ సంభాషణలనుంచి ముఖ్యమైన పత్రాలు, ఫైళ్లను పంపించడానికీ దీనిని వాడుతున్నారు.

ఈ నేపథ్యంలో వ్యక్తిగత సమాచారం గోప్యతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సంస్థ నిర్ణయించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) లాగే ప్రత్యేకమైన యూజర్‌ పేర్లను పరిచయం చేయాలని యోచిస్తోంది. దీని ప్రకారం యూజర్లు తమ మొబైల్‌ నంబర్‌లను వెల్లడిరచకుండానే చాట్‌ (Chat) చేయడానికి వీలు చిక్కుతుంది.

WhatsApp | బీటా దశలో..

వాట్సాప్‌ యూజర్లు ప్రొఫైల్‌ సెట్టింగ్‌ల నుంచి యూజర్‌ నేమ్‌ (User name) క్రియేట్‌ చేసుకోవచ్చు. కొత్త అప్‌డేట్‌ వచ్చాక యూజర్లు చాట్‌ చేయడానికి ఇకపై తమ ఫోన్‌ నంబర్‌లను పంచుకోవాల్సిన అవసరం ఉండదు. దీనికి బదులుగా ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌(Facebook)లోలాగా యూజర్‌ నేమ్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్‌ వాట్సాప్‌ను మరింత ప్రైవేట్‌గా, సరళంగా చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌లోని పరిమిత బీటా (Beta) వినియోగదారుల గ్రూప్‌లో టెస్టింగ్‌లో ఉంది. మరిన్ని బీటా పరీక్షలను పూర్తి చేసిన తర్వాత అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.