అక్షరటుడే, వెబ్‌డెస్క్: WhatsApp | ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్‌ని (WhatsApp) వినియోగిస్తుండగా, యూజర్ల Users అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది. తాజాగా ‘మిస్డ్ కాల్ మెసేజ్‌లు’ (Missed Call Messages) అనే సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.
ఇది పాతకాలపు వాయిస్మెయిల్కు ఆధునిక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడనుంది. ఇకపై మీరు ఎవరికైనా వాయిస్ లేదా వీడియో కాల్ చేసినప్పుడు వారు అందుబాటులో లేకపోతే, ఒక్క ట్యాప్‌తోనే వారికి వాయిస్ నోట్ లేదా వీడియో నోట్‌ను మెసేజ్ రూపంలో పంపించవచ్చు. ఈ నోట్ నేరుగా చాట్‌లోనే రికార్డ్ అవుతుంది. దీంతో కాల్ మిస్ అయినప్పుడు ముఖ్యమైన సమాచారం వెంటనే తెలియజేయడం మరింత ఈజీ అవుతుంది.
WhatsApp | యూత్‌కి చాలా ఉపయోగం..
అలాగే గ్రూప్ వాయిస్ చాట్లలో (Group Voice Chat) మాట్లాడుతున్నప్పుడు సభ్యులు మాట మధ్యలో అడ్డంకి కలగకుండా ఉండేందుకు ‘రియాక్షన్స్’ ఫీచర్‌ను అందించారు. ఇక గ్రూప్ వీడియో కాల్స్‌లో మాట్లాడుతున్న వ్యక్తిని ఆటోమేటిక్‌గా హైలైట్ చేసే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చారు. దీని వల్ల ఎక్కువ మంది ఉన్న వీడియో కాల్లో ఎవరు మాట్లాడుతున్నారో సులభంగా గుర్తించవచ్చు.యూజర్ల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాట్సాప్ తన మెటా ఏఐ ఇమేజ్ జనరేషన్ సామర్థ్యాలను కూడా గణనీయంగా అప్‌గ్రేడ్ చేసింది. మిడ్‌జర్నీ, ఫ్లక్స్ వంటి ఆధునిక మోడల్స్ టెక్నాలజీని వినియోగించడం వల్ల టెక్స్ట్ ఆధారంగా రూపొందించే ఏఐ చిత్రాల నాణ్యత, స్పష్టత మరింత పెరిగింది. పండుగల సమయంలో శుభాకాంక్షలు పంపేందుకు లేదా సరదా గ్రాఫిక్స్ రూపొందించేందుకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడనుంది.
అంతేకాదు, యూజర్లు పంపిన లేదా స్టేటస్‌లో (Status) పెట్టిన సాధారణ ఫోటోలను కూడా చిన్న వీడియో క్లిప్‌లుగా యానిమేట్ చేసే సామర్థ్యాన్ని వాట్సాప్ అందించింది. కేవలం ఒక ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది, ఏఐ ఆ ఫోటోను కదిలే చిత్రంగా మార్చుతుంది.స్టేటస్ అప్డేట్లలో కూడా కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై యూజర్లు తమ స్టేటస్‌లలో మ్యూజిక్ లిరిక్స్, ఇంటరాక్టివ్ స్టిక్కర్లు, ఇతరులు స్పందించేందుకు ప్రశ్నలు అడిగే ఫీచర్లను జోడించుకోవచ్చు. ఛానెల్స్‌లో అడ్మిన్లు ఫాలోవర్లతో మరింత సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసుకునేందుకు ప్రశ్నల ద్వారా రియల్ టైమ్ రెస్పాన్స్ పొందే అవకాశం కల్పించారు. స్క్టాప్ యూజర్ల కోసం కూడా వాట్సాప్ ప్రత్యేక అప్డేట్ తీసుకొచ్చింది. అన్ని డాక్యుమెంట్లు, లింకులు, మీడియా ఫైళ్లను ఒకే చోట సులభంగా వెతకడానికి, నిర్వహించడానికి కొత్త మీడియా ట్యాబ్‌ను ప్రవేశపెట్టింది. అలాగే చాట్లలో షేర్ చేసే పెద్ద లింకుల ప్రివ్యూలను మరింత క్లియర్‌గా, గందరగోళం లేకుండా కనిపించేలా మెరుగుపరిచింది. అన్ని కొత్త ఫీచర్లను హాలిడే సీజన్ సందర్భంగా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చామని వాట్సాప్ ప్రకటించింది.