అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ను కలిస్తే తప్పేంటని ఏపీ మంత్రి నారా లోకేష్ (Lokesh) ప్రశ్నించారు. మంగళవారం ఆయన మాట్లాడారు.
కేటీఆర్, నారా లోకేష్‌ను ఎందుకు కలిశారో చెప్పాలని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై లోకేష్ స్పందించారు. కేటీఆర్‌ను కలుస్తానని ఆయన చెప్పారు. ఎందుకు కలవకూడదని ప్రశ్నించారు. వివిధ సందర్భాల్లో తాను కేటీఆర్‌ను కలిసినట్లు చెప్పారు. దీనికి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్మిషన్ తీసుకోవాలా అని ఆయన ప్రశ్నించారు.
Nara Lokesh | జగన్‌ను పార్టీలో చేర్చుకున్నట్లే..
కల్వకుంట్ల కవిత (Kavitha)ను ఇటీవల బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆమెను టీడీపీలో చేర్చుకుంటారా అని ప్రశ్నించగా.. లోకేష్ స్పందించారు. కవితను టీడీపీలో తీసుకోవడమంటే వైఎస్ జగన్ (YS Jagan)ను చేర్చుకున్నట్లే అన్నారు. తెలంగాణలో సైతం టీడీపీ దృష్టి పెట్టిందని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీపై తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారన్నారు. కాగా 2014 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసిన టీడీపీ తర్వాత ఇక్కడ పోటీకి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి తెలంగాణపై దృష్టి పెట్టామని చెప్పడంతో రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
రెడ్‌బుక్‌లో చాలా కుంభకోణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. అవన్నీ బయటకు తీస్తామన్నారు. ఆ భయంతోనే మాజీ సీఎం జగన్ బెంగళూరులో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. లిక్కర్ కేసులో ప్రభుత్వ జోక్యం లేదని, అధికారులు తమ పని తాము చేసుకుంటున్నారని స్పష్టం చేశారు.