అక్షరటుడే, వెబ్‌డెస్క్: The Raja Saab | డార్లింగ్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజాసాబ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా తొలిరోజు భారీ కలెక్షన్లు సాధించింది.
ఈ ఏడాది సంక్రాంతి విడుదలైన తొలి చిత్రం రాజాసాబ్. హరర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్ (Hero Prabhas) తొలిసారి విభిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.112 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ మేరకు చిత్రబృందం శనివారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. డైరెక్టర్ మారుతి (Director Maruthi), హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ (Producer Vishwaprasad) మాట్లాడుతూ శుక్రవారం రూ.112 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టిందన్నారు.
The Raja Saab | పైరసీ ప్రత్యక్షం
రాజాసాబ్ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నారు. తెలంగాణ (Telangana)లో సినిమా టికెట్ రేట్ల పెంపు లేకపోవడంతో కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే తాజాగా రాజాసాబ్ మూవీ పైరసీ కాపీ ఆన్లైన్లో ప్రత్యక్షం అయింది. హెచ్డీ ప్రింట్‌ను కేటుగాళ్లు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆందోలన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. చిత్ర బృందం సైతం పైరసీపై ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.