Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Bus stand | సమస్యల ప్రయాణ ప్రాంగణం.. అడుగడుగునా గుంతలే దర్శనం..

Kamareddy Bus stand | సమస్యల ప్రయాణ ప్రాంగణం.. అడుగడుగునా గుంతలే దర్శనం..

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Bus stand | పాలకులు మారుతున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి మారడం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఆర్టీసీ బస్టాండ్​లో ఇప్పటికే టాయిలెట్స్, తాగునీరు, ఇతర సమస్యలు వెక్కిరిస్తున్నాయి. మరోవైపు బస్టాండ్​లోకి వెళ్లే దారిలో ఏర్పడిన గుంతలతో తీవ్ర ఇబ్బందులు ఎదరవుతున్నాయి.

Kamareddy Bus stand | మినీ చెరువును తలపిస్తోంది..

బస్టాండు ప్రాంగణంలో (RTC bus stand Area) అడుగడుగునా గుంతలు ఏర్పడడం అవస్థలు తప్పడం లేదు. బస్సులు లోపలికి, బయటికి వెళ్లే ఎంట్రెన్స్​లో భారీగా గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు కుదుపులకు లోనవడంతో అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా వర్షాకాలంలో గుంతల్లో నీళ్లు నిండి కుంటలను తలపిస్తున్నాయి. ఆ నీటిలో గుంతలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది.

Kamareddy Bus stand | బస్సులకు రిపేర్లు..

బస్సులు ప్రయాణం ప్రాంగణంలోకి వచ్చి పోయే సమయంలో కుదుపులకు లోనవడం వల్ల ప్రయాణికులు (Passengers) ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా బస్సులు కూడా త్వరగా చెడిపోతున్నాయి. జిల్లా కేంద్రంలో బస్టాండ్ పరిస్థితే ఇలా ఉంటే ఇతర ప్రయాణ ప్రాంగణాల పరిస్థితి ఏమిటని విమర్శలు వస్తున్నాయి. అధికారులు కనీసం తాత్కాలిక మరమ్మతులు చేయడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

Must Read
Related News