ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | కవిత వ్యాఖ్య‌ల మ‌ర్మమేమిటో?.. పార్టీలో ఉంటానంటూనే తిరుగుబాటు

    MLC Kavitha | కవిత వ్యాఖ్య‌ల మ‌ర్మమేమిటో?.. పార్టీలో ఉంటానంటూనే తిరుగుబాటు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:MLC Kavitha | సొంత పార్టీతో పాటు క‌న్న తండ్రికి, తోడబుట్టిన సోద‌రుడికి వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తుతున్న‌ ఎమ్మెల్సీ క‌విత అడుగులు ఎటువైపు అన్న‌ది ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు. పార్టీ లైన్‌కు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేస్తున్న‌ ఆమె.. బీఆర్ఎస్‌(BRS)లోనే కొన‌సాగుతాన‌ని చెప్ప‌డం వెనుక కార‌ణ‌మేంట‌న్న‌ది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

    ప‌దేళ్లుగా తాను అనేక బీఆర్ఎస్‌లో ఎన్నో ఆవేద‌న‌లు అనుభ‌వించాన‌ని క‌విత మంచిర్యాల ప‌ర్య‌ట‌న‌లో చెప్పారు. అంటే ఇన్నాళ్లు ఆమెకు పార్టీలో ప్రాధాన్యం ద‌క్క‌లేదా? ఆమె చెల్లుబాటు కాలేదా? అన్న‌ది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రోవైపు, మ‌హిళా బిల్లు, బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై పోరాడ‌దామ‌ని తాను ప‌దేళ్ల క్రిత‌మే చెప్పినా.. కేసీఆర్ విన‌లేద‌ని ఈ వివాదంలోకి తండ్రిని లాగారు. కేసీఆర్ దేవుడంటూనే ఆయ‌న‌ను దిగ‌జార్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్న క‌విత అడుగులు ఎటువైపు అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది. కాంగ్రెస్‌లో చేర‌తారని, కొత్త పార్టీని పెడ‌తార‌ని జ‌రుగుతున్న‌ ప్ర‌చారాన్ని ఖండించిన ఆమె.. బీఆర్ఎస్‌లోనే కొన‌సాగుతాన‌ని చెప్ప‌డం విస్మయమే.

    MLC Kavitha | దేవుడంటూనే ఆక్షేప‌ణ‌లు..

    కేసీఆర్(KCR) దేవుడ‌ని, ఆయ‌న నాయ‌క‌త్వంలోనే మాత్ర‌మే తాను ప‌ని చేస్తాన‌ని చెబుతున్న క‌విత‌.. కేసీఆర్‌ను ఆక్షేపించేలా వ‌రుస‌ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప‌దేళ్ల పాల‌న‌లో సామాజిక తెలంగాణ (Telangana) తేలేక‌పోయామ‌న్న క‌విత‌.. తాజాగా మంచిర్యాల ప‌ర్య‌ట‌న‌లో మ‌రికొన్ని కీల‌క అంశాలను వెల్ల‌డించారు.

    “తాను ఎంపీ(MP)గా ఉన్న‌ప్పుడే బీసీ రిజ‌ర్వేష‌న్లు, మ‌హిళా బిల్లు గురించి పార్ల‌మెంట్‌లో లేవ‌నెత్తుదామ‌ని చెప్పా. కానీ కేసీఆర్ ప‌ట్టించుకోలేదు. ఇప్పుడేమైంది? ఒక‌వేళ నేను చెప్పిన‌ట్లు ఆనాడు విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుని ఉంటే ఇవాళ బీఆర్ఎస్‌కు పేరు వ‌చ్చేది క‌దా?” అని క‌విత వెల్ల‌డించారు. అలాగే, పార్టీలో, సింగ‌రేణి(Singareni)లో కొత్త నాయ‌క‌త్వానికి అవ‌కాశం ఇద్దామ‌ని తాను చెప్పినా ప‌ట్టించుకోలేద‌ని చెప్పారు. ప‌దేళ్లుగా తాను పార్టీలో ఎన్నో ఆవేద‌న‌లు అనుభ‌వించాన‌ని చెప్ప‌డం ద్వారా కేసీఆర్‌ను ఇరుకునే పెట్టేలా వ్యాఖ్యానించారు. కేసీఆరే మా నాయ‌కుడ‌ని, ఆయ‌న నాయ‌క‌త్వంలోనే ప‌ని చేస్తాన‌న్న క‌విత‌.. మరి ఆయ‌నకు వ్య‌తిరేకంగా ఎందుకు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌న్న‌ది అంతుచిక్క‌డం లేదు. త‌న రాజ‌కీయ ఆశయాల‌కు గండి కొట్టిన కేటీఆర్‌(KTR)పైన విమ‌ర్శ‌లు చేస్తే స‌రే కానీ, కేసీఆర్‌ను కూడా వివాదంలోకి లాగ‌డం ద్వారా క‌విత భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ఏమిట‌న్న‌ది స‌స్పెన్స్‌గా మారింది.

    MLC Kavitha | ప‌ర‌స్ప‌ర విరుద్ధ ప్ర‌క‌ట‌న‌లు..

    క‌విత వ్యాఖ్య‌లు కొన్ని ప‌ర‌స్ప‌ర విరుద్ధంగా ఉంటున్నాయ‌నేందుకు.. త‌న తండ్రిని ఉద్దేశించి తాజా వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నం. కేసీఆరే మా నాయ‌కుడ‌ని చెబుతూ, ఆయ‌నను ఇరుకున పెట్టేలా వ్య‌వ‌హ‌రించ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కొత్త పార్టీ పెట్ట‌న‌ని స్ప‌ష్టం చేస్తూ.. పార్టీలోనే ఉంటానంటూనే ఇలా బీఆర్ఎస్‌(BRS)కు న‌ష్టం చేసే వ్యాఖ్య‌లు చేయ‌డం కూడా ప‌ర‌స్ప‌ర వైరుద్ధ్యాన్ని ఎత్తిచూపుతోంది.

    బీఆర్ఎస్ త‌న‌దని, త‌న‌ను వెళ్ల‌గొట్టేది ఎవ‌ర‌ని ప్ర‌శ్నిస్తున్న క‌విత‌.. తెలంగాణ‌ను సాధించిన పార్టీని గుండెల్లో పెట్టి కాపాడుకోవాల‌న్న‌దే త‌న తాప‌త్రాయం త‌ప్పితే కొత్త పార్టీ పెట్టాల‌న్న ఆలోచ‌న లేద‌ని స్ప‌ష్టం చేశారు. అస‌లు ఆమె ఆలోచ‌న‌లు ఏమిటి? ఆమె అడుగులు ఎటు వైపు? పార్టీ నాయకత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? అన్న‌ది తెలియ‌క గులాబీ శ్రేణుల్లో గంద‌ర‌గోళం కొన‌సాగుతోంది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...