Homeక్రీడలుHikaru Nakamura | ఎందుకంత పొగ‌రు.. గెలిచిన గ‌ర్వంతో ప్ర‌త్య‌ర్థి కింగ్ అలా విసిరేయడం ఏంటి?

Hikaru Nakamura | ఎందుకంత పొగ‌రు.. గెలిచిన గ‌ర్వంతో ప్ర‌త్య‌ర్థి కింగ్ అలా విసిరేయడం ఏంటి?

Hikaru Nakamura | అమెరికా జట్టు భారత జట్టుపై 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఇందులో నకమురా vs గుకేశ్ మ్యాచ్‌ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఈవెంట్‌పై మ‌రింత ఆస‌క్తిని క‌లిగించేందుకు, క్రీడాకారులు టీమ్ జెర్సీలు ధరించి, బాక్సింగ్ మ్యాచ్‌ తరహాలో అభిమానుల హర్షధ్వానాల మధ్య వేదికపైకి ప్రవేశించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hikaru Nakamura | అమెరికా భారత్ మధ్య జ‌రిగిన చెస్ ఈవెంట్‌(Chess Event)లో గ్రాండ్‌మాస్టర్ హికారు నకమురా, భారత యువ ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్ పై విజయం సాధించి ప్రపంచ వ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువయ్యాడు. అయితే మ్యాచ్ అనంతరం నకమురా చేసిన సెలబ్రేషన్ స్టైల్ వివాదాస్పదమైంది.

చివరి గేమ్‌లో బులెట్ టైమ్ కంట్రోల్‌ ఫార్మాట్‌లో గుకేశ్‌(Gukesh)కి చెక్ పెట్టిన న‌కమురా, ఆనందోత్సాహంతో గుకేశ్ ‘కింగ్’ పావును తీసుకుని ప్రేక్షకుల వైపు విసిరాడు. ఇది చూసిన గుకేశ్ కొంత ఇబ్బందికి గుర‌య్యాడు.ఈ ఘ‌ట‌న‌పై నకమురా మాట్లాడుతూ, “గెలిచిన ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేశాను. వారివద్ద నుండి చప్పట్లు వినాలనిపించింది అని అన్నాడు.

Hikaru Nakamura | చెస్‌లో కొత్త ఒరవడి

ఈ మ్యాచ్‌ను సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా నిర్వహించారు. క్రీడాకారులు టీమ్ జెర్సీలు ధరించి, బాక్సింగ్ మ్యాచ్‌ల తరహాలో స్టేడియానికి వచ్చారు. అభిమానుల కేరింతలు, శబ్దాలతో స్టేడియం ద‌ద్దరిల్లింది. ఈవెంట్ మొత్తంలో నకమురా-గుకేశ్ గేమ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో అమెరికా జట్టు భారత్‌ను 5-0తో ఓడించింది. అయితే నకమురా సెలబ్రేషన్‌పై విమర్శల వెల్లువ కురుస్తుంది. నకమురా ‘కింగ్’ పావును విసిరిన తీరు మీద కొంతమంది అభిమానులు, చెస్ దిగ్గజాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది గ్రాండ్‌మాస్టర్‌కు తగిన ప్రవర్తన కాదు, చెస్ హుందాతనాన్ని చెడ‌గొట్టే చర్య” అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయితే నిజంగా ఎవరినీ అపహాస్యం చేయాలన్న ఉద్దేశం లేదు. ఇది కేవలం చెస్‌ను మరింత వినోదాత్మకంగా, ప్రేక్షకులకు ఆసక్తికరంగా చూపించాలన్న ఉద్దేశంతో చేశాను. నిర్వాహకుల ప్రోత్సాహంతో ఇదంతా జరిగింది అని న‌క‌మురా పేర్కొన్నాడు. ఈవెంట్‌ను ప్రదర్శన పరంగా చూస్తే, ఆధునిక చెస్‌కు కొత్త శకం మొదలయ్యిందని చెప్పవచ్చు. మ్యాచ్‌లను మరింత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు, ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఇలా విజువల్స్, థియేట్రిక్స్ జోడించడం ఓ ప్రయోగం. మొత్తానికి… గుకేశ్‌పై నకమురా గెలుపు కంటే, అతని సెలబ్రేషన్స్‌పై వ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే రానున్న రోజుల‌లో చెస్ రూట్ మార‌బోతుందా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.